Etela Rajender: అలా చేస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటా.. ఈటల సంచలన సవాల్

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు.

New Update
Etela Rajender : సీఎం రేవంత్‌కు ఈటల సవాల్

Etela Rajender: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ సగం హామీలను కూడా అమలు చేయలేక పోయిందని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు నెల రూ.2 వేల పెన్షన్ ఇస్తామని చెప్పి సరిగ్గా ఇవ్వలేకపోయిందని.. ఒక్కొ నెల అసలు పెన్షన్ ఇవ్వలేదని అన్నారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.2500 పెన్షన్ ఇస్తామని అంటుందని.. అమల్లోకి తేలేని పథకాలను చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని అన్నారు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

రాజకీయాలు వదిలేస్తా..

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంచలన సవాల్ విసిరారు ఈటల రాజేందర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఎందుకు రుణమాఫీ చేయడం లేదని నిలదీశారు. పంట కోతకు వచ్చే సమయంలో కూడా రైతులను రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం అని.. కోతకు వచ్చే సమయంలో ఇంకా రైతు బంధు వేయకపోవడం ఏంటని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

రెండో అవకాశం..

అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ మరో అవకాశం కల్పించింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. దేశంలో అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను మొదటి లిస్టులోనే ఈటల రాజేందర్ కు కాషాయ అధిష్టానం ప్రకటించింది. కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఆయన సిట్టింగ్ స్థానమైన హుజురాబాద్‌తో పాటు గులాబీ బాస్ కేసీఆర్‌పై గజ్వేల్ నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు చోట్ల (హుజురాబాద్, గజ్వేల్) ఈటల రాజేందర్ ఓటమి చెందారు. దీంతో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు