Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్?

కాంగ్రెస్‌కు కామ్రేడ్లు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తమకు పొత్తులో భాగంగా రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్ చేయగా.. దీనికి కాంగ్రెస్ నో చెప్పినట్లు సమాచారం. దీంతో పొత్తు రద్దు చేసుకునే ఆలోచనలో కామ్రేడ్లు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్?
New Update

Telangana Congress Party: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కామ్రేడ్లు టికెట్ల పంచాయతీ తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పై లెఫ్ట్ పార్టీ నేతలు గుస్సాగా ఉన్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఐ, సీపీఎం (CPM) పార్టీలు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుపై ఏటూ తేల్చుకోలేకపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పొత్తులపై ఎలాంటి చర్చలు జరపడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్ల ఎన్నికల్లో సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ ను సీపీఐ పార్టీకి (CPI Party) కేటాయించింది. కాగా.. సీపీఎం మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది.

రెండు ఎంపీ టికెట్లు..

కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా చెరో సీటు కావాలని లెఫ్ట్ నేతలు ప్రతిపాదన చేస్తున్నారు. వామపక్షాల వినతిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడంలేదని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరుకుంది. లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 9 మంది అభ్యర్థిలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిచేందుకు సిద్ధమైంది.

ఢిల్లీకి సీఎం రేవంత్..

ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మీటింగ్ కు హాజరు కానున్నారు. లెఫ్ట్ పార్టీల పొత్తులపై ఎన్నికల కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాలయాపన చేయొద్దని కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు వార్నింగ్ ఇస్తున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీట్ల సర్దుబాటుపై చివరి వరకు తేల్చని ఏఐసీసీ. పార్టీ తీరుపై బహిరంగ ప్రకటనలతో లెఫ్ట్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదా? అంటూ సీపీఐ నారాయణ ట్వీట్ చేశారు. ఇప్పటికే భువనగిరి అభ్యర్థిని సీపీఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన సీపీఐ భవిష్యత్ కార్యచరణకు సిద్దమవుతోంది. ఒకవేళ పొత్తు లేకపోతే ఒంటరిగా పోటీ చేయాలని సీపీఐ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి లోక్ సభ ఎన్నికల్లో సీపీఐకి హస్తం పార్టీ పొత్తు పెట్టుకుంటుందా లేదా హ్యాండ్ ఇస్తుందా అనేది వేచి చూడాలి.

#congress-party #cpi #lok-sabha-elections #cpm
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe