Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లను త్వరలోనే ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో తమ ప్రభుత్వం చేరుతున్నట్లు తెలిపారు.

Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
New Update

Pradhan Mantri Fasal Bima Yojana Scheme in Telangana: ఇవాళ సచివాలయంలో వ్యవసాయ శాఖ పథకాలపై (Agriculture Schemes) సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. త్వరలనే రెండు కమిషన్లను ప్రకటించబోతున్నాం అని అన్నారు.

మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ (Education Commission) నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో (Kodangal) ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రైతులకు గుడ్ న్యూస్..

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొన్ని విపత్తుల వల్ల నష్టపోతున్న రైతులకు అండగా ఉండేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. బీజేపీ సర్కార్ 2016 లో తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో (PMFBY) చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Also Read: కేసీఆర్‌ను లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర.. హరీష్ రావ్ సంచలన వ్యాఖ్యలు

యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ..

గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు సీఎం రేవంత్. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎఎస్సీ (TSPSC) ద్వారా నియామకాలు చేపడతాం అని స్పష్టం చేశారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాని తెలిపారు. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా (Rythu Bharosa) అనేది పెట్టుబడి సాయం అని.. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

#cm-revanth-reddy #good-news-for-farmers #pmfby-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe