KTR Challenge to Revanth: నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. తాను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇద్దరం కలిసి మల్కాజ్ గిరి నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేద్దామా? అని సవాల్ విసిరారు.

New Update
MLA KTR: సీఎం రేవంత్‌తో పాటు బీజేపీలోకి ఆ కీలక నేత.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR Challenge to CM Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు సవాళ్లు ప్రతిసవాళ్ల నడుమ సాగుతున్నాయి. ఇటీవల చేవెళ్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలవండి అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా రేవంత్ చేసిన సవాల్ కు కౌంటర్ మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. తాను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇద్దరం కలిసి మల్కాజ్ గిరి నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేద్దామా? అని సవాల్ విసిరారు.

రేవంత్ నువ్వు మగాడివి కాదా?..

సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు కేటీఆర్. గెలిచిన ప్రతిసారి మగాడివి, ఓడితే కాదు అంటావా? అని ప్రశ్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓడిపోయినప్పుడు మగాడివి కాదా? అంటూ సీఎం రేవంత్ పై చురకలు అంటించారు. మగాడివి అయితే రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయాలని అన్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన 420 హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ కు ఆ రోగం..

రేవంత్ రెడ్డికి ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే జబ్బు ఉందని అన్నారు కేటీఆర్. కొడంగల్, జీహెచ్ఎంసీ సమయంలో పోటీ చేసి సవాల్ విసరి పారిపోయిండు అంటూ ఎద్దేవా చేశారు. ఆయన మాటకు విలువ ఏం ఉంది? అని అన్నారు. రేవంత్ కు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలనీ.. తాను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం అని ప్రతిసవాల్ విసిరారు.

రేవంత్ ది పేమేంట్ కోటా...

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని అన్నారు కేటీఆర్. కేటీఆర్ ది మేనేజ్ మెంట్ కోటా అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తనది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియాంక గాంధీలది ఏం కోటా ? అని అన్నారు. రేవంత్ ది పేమేంట్ కోటా.. మాణిక్యం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా అని ఆరోపణలు చేశారు. పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్ డీల్లీకి పేమేంట్ చేయాలని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి నేనే సీఎం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారని... ఆయనకు ఆయననే సీఎం అన్న నమ్మకం లేదా? అని ఎద్దేవా చేశారు.

Advertisment
తాజా కథనాలు