Kale Yadaiah: సీఎం రేవంత్‌తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన త్వరలో కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. By V.J Reddy 05 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS MLA Kale Yadaiah May Join Congress: లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలను కావలవద్దని కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే.. కేసీఆర్ (KCR) ఆదేశాలు పక్కకు పెట్టి సీఎం రేవంత్ (CM Revanth Reddy) ను కలుస్తున్నారు గులాబీ నేతలు.తాజాగా యాదయ్య సీఎంను భేటీ కావడంతో.. ఆయన త్వరలో కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. భద్రచలం ఎమ్మెల్యేకు కూడా? తెలంగాణ(Telangana) లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) లోకి వలసలు ఆగడం లేదు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఈ జాబితాలో బీఆర్ఎస్ నుంచి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkat Rao) తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసం లో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం మరోసారి జోరందుకుంది. అభివృద్ధి కొరకే.. ఇదిలా ఉండగా.. భద్రాచలం(Bhadrachalam) ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. నియోజక అభివృద్ధి విషయాలు మాట్లాడేందుకు ఆయన సీఎం రేవంత్ ను కలిశారని.. రాజకీయాలు మాట్లాడేందుకు కలవలేదని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది బీఆర్ఎస్. మరోవైపు సీఎం రేవంత్ తో భేటీ తెల్లం వెంకట్రావు స్పందించకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. Also Read: కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ.. బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు? #cm-revanth-reddy #lok-sabha-elections #brs-mla-kale-yadaiah #brs-mla-joins-congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి