Nannapuneni Narender: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?

TS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నేత రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ బీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న బీజేపీ కండువా కప్పుకొనునట్లు సమాచారం.

New Update
Nannapuneni Narender: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే?

Nannapuneni Narender May Join BJP:అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడే కోలుకుంటున్న బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) నేతలను కాపాడుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్య నేతల రాజీనామాలతో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నేత రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ బీఆర్ఎస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న బీజేపీ కండువా కప్పుకొనునట్లు సమాచారం. నన్నపనేనితో పాటు ఐదుగురు కార్పొరేటర్లు బీజేపీలో చేరే ఛాన్స్‌ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన నరేందర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పటికే వరంగల్‌ జిల్లాలో కడియం శ్రీహరి, ఆరూరి రమేష్‌ బీఆర్ఎస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే.

ALSO READ: ఎలా అరెస్ట్ చేస్తారు?.. కోర్టుకు కవిత

కడియంకు, రమేష్ కు లక్కీ ఛాన్స్..

పార్టీ మారిన నేతలకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ లు జాక్ పాట్ కొట్టారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో (BJP) చేరిన ఆరూరి రమేష్ కు ఎంపీ టికెట్ దక్కింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ లో పోటీ చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరిన కడియం కు కాంగ్రెస్.. అతని కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య వరంగల్ లో పోటీ చేయనుంది. కానీ, వాస్తవానికి వస్తే ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో  వరంగల్ లో పోటీ చేసే వారు అంత ఒకప్పటి బీఆర్ఎస్ నేతలే. కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు కారు దిగినవారే కావడం గమనార్హం. వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు