KCR: లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్‌కు బిగ్ షాక్!

కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్‌ నుంచి పలువురిని బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు కేసీఆర్. ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తారో లేదో చెప్పాలని.. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని కేసీఆర్‌కు లేఖ రాశారు.

KCR: కేసీఆర్‌కు భారీ షాక్.. ఫౌమ్ హౌజ్‌లో తనిఖీలు చేసి సీజ్ చేయాలని డీజీపీకి కంప్లైంట్!
New Update

BRS Chief KCR : లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR) కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కేసీఆర్‌పై మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ కు ఘాటు లేఖను మహారాష్ట్ర(Maharashtra) బీఆర్‌ఎస్‌ నేతలు రాశారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులకు అద్దె చెల్లింపు నిలిపివేసింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. మహారాష్ట్ర నేతల ఫోన్లు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సమాచారం. మహారాష్ట్ర నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఫండింగ్ ఆపివేయడంతో పార్టీ కార్యక్రమాలకు నిలిచిపోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్‌(Congress) నుంచి పలువురిని చేర్చుకుంది బీఆర్‌ఎస్‌. తాజా పరిణామాలపై ఆరుగురు కోఆర్డినేటర్లు సమావేశం అయ్యారు. బీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు లేఖ రాశారు.

Also Read : త్వరలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మహాలో అప్పుడు జోరు.. మరి ఇప్పుడు?

దేశ రాజకీయాల్లో తెలంగాణ నాయకుడు చక్రం తిప్పాలని టీఅర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ను బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మార్చారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ  అవతరించిన తరువాత తెలంగాణ కంటే మహారాష్ట్రపై ఎక్కువ ఫోకస్ పెట్టారు కేసీఆర్. గతంలో మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారు దూసుకెళ్లింది. అక్కడి కొత్త పార్టీగా వచ్చిన మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా మారుతుందని అనుకున్న అక్కడి ప్రతిపక్ష నేతలు సొంత పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో కేసీఆర్ దేశ రాజకీయాలను పక్కకి పెట్టి రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మరి దేశ రాజకీయాల్లో తన సత్తా చాటాలని భావించిన కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.

తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు..

తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను 16 స్థానాల్లో గెలిచి పార్లమెంట్ కు గులాబీ నేతలను పంపాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్- వినోద్ కుమార్, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్, మహబూబాబాద్ - మాలోత్ కవిత, ఖమ్మం - నామా నాగేశ్వరావు, మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి పేర్లను ఫైనల్ చేశారు. అయితే మిగతా స్థానాలపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. త్వరలోనే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు.

#kcr #maharashtra #lok-sabha-elections #shock-for-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe