BRS Party : బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌

లోక్ సభ ఎన్నికల ముందు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నిజాంపేట మేయర్‌, కార్పొరేటర్లు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల GHMC మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

New Update
BRS: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన నేతలు

Shock To BRS Party : నేతల రాజీనామాలతో సతమతమవుతున్న బీఆర్ఎస్(BRS) పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) లో మరో షాక్‌ తగిలింది. నిజాంపేట మేయర్‌, కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. మేడ్చల్‌ జిల్లాలో నిజాంపేట కార్పొరేషన్‌ కీలకంగా ఉంది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు కీలక అనుచరులుగా మేయర్‌, కార్పొరేటర్లు ఇన్నాళ్లుగా ఉన్నారు. ఇటీవలే మేయర్‌, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చలు జరిపారు.

వారిద్దరూ బుజ్జగించినా కార్పొరేటర్లు వెనక్కి తగ్గలేరు. నిజాంపేట బీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్లు రెండు గ్రూపులు ఉండేవి. మేయర్‌, ఆమె భర్త తీరుకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు కొలను శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మేయర్‌ చేరికతో కొలను శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌, ఆమె భర్త చేరికపై కాంగ్రెస్‌లో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. మరో కీలక నేత కూడా పార్టీ మారతారని ప్రచారం జోరుగా జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు