Lok Sabha Elections 2024 : రాజకీయ వారసుడి పై మాయావతి వేటు..కేవలం 5 నెలల్లోనే!

బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త అయినటువంటి ఆమె మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌ ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు.

Lok Sabha Elections 2024 : రాజకీయ వారసుడి పై మాయావతి వేటు..కేవలం 5 నెలల్లోనే!
New Update

BSP : బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త అయినటువంటి ఆమె మేనల్లుడు ఆకాశ్‌ ఆనంద్‌(Akash Anand) ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు. కొద్ది రోజుల క్రితం ఆయన బీజేపీ(BJP) పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి వివరించారు.

కాగా, సామాజిక మార్పు కోసం అంబేద్కర్ చేసిన ఉద్యమానికి కొనసాగింపుగా కాన్షీరామ్, నేను జీవితం మొత్తాన్ని దాని కోసమే అంకితం చేశామని మాయావతి చెప్పుకొచ్చారు. అందుకే కొత్తతరాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం.. ఈ క్రమంలో పార్టీలో కొత్త వ్యక్తులను ప్రోత్సహించడం కోసం ఆకాశ్‌ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా ప్రకటించాం. కానీ, పార్టీ, ఉద్యమ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఆకాష్ పూర్తి స్థాయిలో పరిపక్వత సాధించే వరకు ఆయన్ని కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అప్పటి వరకు ఆయన తండ్రి ఆనంద్‌ కుమార్‌ పార్టీలో కీలక బాధ్యతలను నిర్వహిస్తారని మాయావతి వెల్లడించారు. అయితే, కొద్దిరోజుల క్రితం ఎన్నికల ప్రచార ర్యాలీ(Election Campaign Rally) లో ఆకాశ్‌ .. యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్‌ గవర్నమెంట్‌గా పేర్కొన్నారు. యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది.

Also read:  గోడకూలి ఏడుగురి మృతి..నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాలు!

#bjp #elections #bsp #bsp-chief-mayawatis #akash-anand
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe