Lok Sabha Elections: బీజేపీ 195 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గాను 5 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించారు. ఇందులో దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పేరు కూడా ఉంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బన్సూరి స్వరాజ్‌కు టిక్కెట్టు ఇచ్చారు. దీంతో పాటు చాందినీ చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్‌వాల్, నార్త్‌ఈస్ట్ ఢిల్లీ నుంచి భోజ్‌పురి స్టార్ మనోజ్ తివారీ, పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్‌జీత్ సెహ్రావత్, దక్షిణ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ బిధూరీలకు టికెట్ ఇచ్చారు. బీజేపీ తన నలుగురు సిట్టింగ్ ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారికి టికెట్టు ఇచ్చేందుకు నిరాకరించింది.టికెట్ నిరాకరించిన వారిలో రమేష్ బిధూరి, ప్రవేశ్ వర్మ, మీనాక్షి లేఖి, హర్షవర్ధన్ పేర్లు ఉన్నాయి.
క్రియాశీల రాజకీయాల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన, దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ గతంలో మార్చి 2023లో ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమితులయ్యారు. చట్టపరమైన విషయాలలో స్వరాజ్ బీజేపీలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ.. రాజకీయ రంగంలో ఆమెకు ఇది మొదటి పోస్ట్ అని చెప్పవచ్చు. తనకు అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
బాన్సూరి స్వరాజ్ కెరీర్‌ని ఒకసారి చూద్దాం:
- వృత్తిరీత్యా న్యాయవాది అయిన బన్సూరి 1984లో దివంగత సుష్మా స్వరాజ్, ఏకైక కుమార్తె.
- బన్సూరి స్వరాజ్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఎప్పటికప్పుడు చట్టపరమైన విషయాలలో బిజెపికి సహాయం చేస్తుంటారు.
– స్వరాజ్ 2007లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో చేరారు.
-బిజెపి ప్రకారం, బన్సూరి స్వరాజ్‌కు న్యాయవాద వృత్తిలో 17 సంవత్సరాల అనుభవం ఉంది.
– వార్విక్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో BA (ఆనర్స్) పట్టా పొందిన తరువాత, బన్సూరి స్వరాజ్ లండన్‌లోని BPP లా స్కూల్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు.
-బాన్సురి స్వరాజ్ న్యాయశాస్త్రంలో బారిస్టర్ డిగ్రీని పొందారు.
– దీని తర్వాత ఆమె సెయింట్ కేథరీన్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ స్టడీస్ కూడా పూర్తి చేశాడు.
-బాన్సురి స్వరాజ్ చాలా అరుదుగా మీడియాలో కనిపిస్తుంటారు. సాధారణంగా తక్కువ ప్రొఫైల్‌లో ఉంటారు.
ఇది కూడా చదవండి: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.!