Lok Sabha : తెలంగాణలో ప్రభావం చూపని కాంగ్రెస్.. కలిసిరాని అంశాలివే!

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకబడిపోవడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 8 సీట్లకే పరిమితమై కాంగ్రెస్ 6గ్యారెంటీల అమలు చేయకపోవడమే ప్రధానంగా చర్చ నడుస్తోంది. బలమైన అభ్యర్థులను నియమించపోవడతోపాటు అతి విశ్వాసమే అంటున్నారు విశ్లేషకులు.

New Update
Aarogya Sri: తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ‘ఆరోగ్య శ్రీ‘లో మరిన్ని సేవలు!

Congress : తెలంగాణ (Telangana) లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొదటినుంచి దాదాపు 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరిలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చవిచూసింది. అయితే కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? ఆరు గ్యారంటీల హామీలే దెబ్బ తీశాయా? లేక బలమైన అభ్యర్థులను బరిలోకి దించకపోవడగమే కాంగ్రెస్ వెనకబడిపోవడానికి కారణమా? ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుందాం.

ఆరు గ్యారెంటీల హామీల్లో అలసత్వం..
ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను పూర్తిగా అమలు చేయలేదనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే చాలా చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ ను ఢికొట్లే నాయకుడు లేడని, బలహీనమైన అభ్యర్థులు నిలిపారనే ప్రచారం జరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. చేవెళ్ల మల్కాజ్ గిరి, కరీంనగర్, మెదక్, కరీంనగర్ వంటి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ప్రత్యేకంగా ఫోకస్ చేయకపోవడం అతి విశ్వాసమే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇక కరెంట్ కోతలు, ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో కాంగ్రెస్ పై ఓటర్లకు కారణం అయ్యాయనే టాక్ వినిపిస్తోంది.

మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడం..
ఇదిలా ఉంటే మాదిగ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కేటాయించకపోవడంపై కూడా విమర్శులు వెల్లువెత్తాయి. టికెట్ కేటాయించకుండా ఆ వర్గాన్ని దూరం చేసుకోవడంతో ఓట్లు పడలేదని తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ (BRS) ఓటు బ్యాంక్ పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఆ ఓటు బ్యాంక్ అంతా బీజేపీ వైపు మళ్లింది. బీజేపీపై గాడిద గుడ్డు అంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లలేదు. మొత్తం రెడ్ల రాజ్యం అంటూ జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం కూడా బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. రైతుభరోసా, బోనస్, రుణమాఫీ, సాగు నీరు కొన్ని చోట్ల పూర్తిగా అందకపోవడం, కరెంట్ కోతలు రైతుల ఓట్లను దూరం చేశాయనే వాదనలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు