Loan App: అప్పు తీసుకున్న పాపానికి అశ్లీల ఫొటోలతో.. ఈ లోన్ యాప్ ఏం చేసిందంటే?

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బోరబండలో చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తాళలేక విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ వేధింపులతో తమ కొడుకు బలవన్మరణానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Loan App: అప్పు తీసుకున్న పాపానికి అశ్లీల ఫొటోలతో.. ఈ లోన్ యాప్ ఏం చేసిందంటే?
New Update

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ, బ్రహ్మ శంకర్‌నగర్ బస్తీకి చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సూపర్‌​వైజర్‌గా పని చేస్తున్నాడు. అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండి ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకున్నాడు. అయితే.. విజయ్ కుమార్ డబ్బులు సకాలంలో చెల్లించక పోవటంతో లోన్ యాప్ ఆగడాలు ఎక్కువైయ్యాయి.

అసభ్యకర ఫొటోని రిఫరెన్స్ నంబర్లకు

బాధితుడు విజయ్ కుమార్ రిఫరెన్స్ నంబర్స్ అందరికీ ఫోన్‌లు చేసి ఇబ్బంది పెట్టారు ఆన్‌లైన్‌ నిర్వాహకులు. వడ్డీ అధికంగా వేసి చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో విజయకుమార్ రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో బాధితుడు ఫొటోని ఆశ్లీల ఫొటోతో మార్ఫింగ్ చేశారు. అంతేకాదు ఆ అసభ్యకర ఫొటోని రిఫరెన్స్ నంబర్స్ అందరికీ సెండ్‌ చేశారు. దాంతో శుక్రవారం రాత్రి పాయిజన్ తాగి బాధితుడు విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించించినా.. ఉపయోగం లేదు. అప్పటికే విజయ్‌కుమార్‌ మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు బోరబండ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అనధికారిక యాప్‌లను యాక్సెస్ చేయడం 

అయితే గతంలో ఆన్‍లైన్ రుణ యాప్‌లపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. అమాయకులకు అప్పు ఇచ్చి.. అధిక వడ్డీలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అప్పు తీర్చినా.. కూడా వేధింపులు ఆపని సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తెలిసి తెలియక ఇలా రుణ యాప్ వేధింపులు తాళలేక చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆన్ లైన్ రుణ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. టెక్నాలజీ పెరిగినా.. లోన్ యాప్ వేధింపులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. లోన్‌ యాప్‌ ఏజెంట్లు బరితెగించి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే లోన్‌ తీసుకున్న బాధితులు ఎక్కువగా విద్యార్థులతో పాటు.. ఇతరులు కూడా ఉన్నారు. అయితే ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ ఏజెంట్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. కొందరు మాత్రం ధైర్యం చేసి..పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.  నగరంలో పెరుగుతున్న లోన్ యాప్ మోసాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు సులభంగా లభించే రుణాల కోసం ఆశపడి మోసపోవద్దని మరికొంత మంది హెచ్చరిస్తున్నారు. అనధికారిక యాప్‌లను  డౌన్ లోడ్ చేయోదని చెబుతున్నారు. తెలియని లింక్ లను యాక్సెస్ వంటివి చేయొద్దని పోలీసులు చెబుతూనే ఉన్నారు.

#hyderabad #police-station #under-borabanda #vijay-kumar-suicide #loan-app-harassment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe