L.K. Advani : బీజేపీ(BJP) లో అత్యంత పెద్ద వయస్కులు ఎల్‌కే అద్వానీ(LK Advani). ఈయననకు కురువృద్ధుడు అని కూడా అంటారు. అద్వానీ వయసు ప్రస్తుతం 96 ఏళ్ళు. ఈయన ఎక్కువగా బయటకు కూడా రావడం లేదు. బీజేపీ కార్యక్రమాలకు కూడా హాజవడం లేదు. ఒకరకంగా రాజకీయ సన్యాసం తీసుకున్నారనే చెప్పాలి. అయితే ఇప్పుడు అయోధ్య రామ్ లల్లా విగ్రహ(Ram Lalla Idol) ప్రాణ ప్రతిష్ట(Prana Pratishtha) కు కూడా అద్వానీ రావడం లేదు. ప్రస్తుతం ఉత్తర భారతదేశం(India) లో చలి చాలా ఎక్కువగా ఉంది. అద్వానీ లాంటి పెద్ద వయసు వారు దీనిని తట్టుకోవడం చాలా కష్టం. ఇదే కారణంతో తాను అయోధ్యకు రాలేకపోతున్నానని అద్వానీ చెప్పారు. అయితే తాను బతికుండగా అయోధ్య రామ మందిరం(Ram Mandir) నిర్మాణం జరగడం, బాల రాముణ్ణి ప్రతిష్టించడం అత్యంత ఆనందాన్ని ఇచ్చిందని, తమ జన్మ ధన్యమయిందని అద్వానీ వ్యాఖ్యానించారు. ఈయనతో పాటూ మరో పెదత్దాయన మురళీ మనోహర్ జోషి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.
Also Read:అయోధ్యలో మొదలైన ప్రాణప్రతిష్ట క్రతువు
రామమందిర నిర్మాణానికి పోరాటం...
లాల్ కృష్ణ అద్వానీ 1990వ దశకంలో కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు గుజరాత్(Gujarat) లోని సోమనాథ్ నుండి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని అయోధ్య(Ayodhya) వరకు వివాదాస్పద రథయాత్రకు నాయకత్వం వహించారు. రథయాత్ర అయోధ్యకు చేరుకోలేదు కానీ అద్వానీ పేరు మాత్రం రామ మందిర వివాదంతో విడదీయరాని విధంగా ముడిపడి పోయింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికే అద్వానీ అప్పట్లో రథయాత్ర నిర్వహించారు. దీని వల్ల మతపరమైన అల్లర్లు కూడా చెలరేగాయి. ఉద్రిక్తతలకు దారి తీయడంతో అప్పటి బీమార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పథయాత్రను నిలివేసి, అద్వానీని అరెస్ట్ చేయించారు.