Rahul Gandhi: సోనియాకి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన రాహుల్‌..దానిని చూసి సోనియా!

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (RahulGandhi) కూడా ఈ ప్రపంచ జంతు దినోత్సవం రోజు తన తల్లి సోనియా గాంధీ(Sonia gandhi) ని సర్‌ప్రైజ్ చేశారు. తన ఇంటికి మరో కొత్త సభ్యుడిని తీసుకుని వచ్చి పరిచయం చేశారు.

New Update
Rahul Gandhi: సోనియాకి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన రాహుల్‌..దానిని చూసి సోనియా!

Rahul Gandhi Surprise Gift for Sonia Gandhi: అక్టోబర్ 4 ప్రపంచ జంతు దినోత్సవంగా ( World animal day) అంకితం చేశారు. ఇది జంతు హక్కుల కోసం ప్రపంచవ్యాప్త చొరవ. దీని ప్రధాన లక్ష్యం జంతు సంక్షేమం కోసం మెరుగైన ప్రమాణాలను నిర్ధారించడం. ఈ రోజు సాధారణంగా అంతరించిపోతున్న జాతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతుంది.

ప్రపంచ జంతు దినోత్సవాన్ని క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది జంతు రక్షణ కదలికను ఏకం చేయడంతోపాటు..ప్రోత్సహిస్తుంది. జంతు సంరక్షణ ఆశ్రయం, జంతు సంక్షేమానికి కొంత సహకారం అందించడమే కాకుండా, ప్రజలు ఈ రోజున అనేక ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించి.. జంతు జాతులను రక్షించడంతోపాటు వాటి సంక్షేమాన్ని కాపాడటం అనేది ప్రధానం. ఈరోజును జంతు ప్రేమికుల దినోత్సవంగా కూడా పిలుస్తారు.

Also read: నేడు ప్రపంచ జంతు దినోత్సవం..దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి..?

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా ఈ ప్రపంచ జంతు దినోత్సవం రోజు తన తల్లి సోనియా గాంధీ(Sonia gandhi) ని సర్‌ప్రైజ్ చేశారు. తన ఇంటికి మరో కొత్త సభ్యుడిని తీసుకుని వచ్చి పరిచయం చేశారు. గోవానుంచి తీసుకుని వచ్చిన కొత్త కుక్క పిల్ల నూరీ ఫోటోను ఆయన నెట్టింట్లో షేర్‌ చేశారు.

దానిని తన తల్లి సోనియాకి బహుమతిగా ఇచ్చినట్లు ఆయన వివరించారు. రాహుల్‌ ఆగస్టులో గోవా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఓ కుక్కల పెంపక కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జాక్‌ రస్సెల్ టెర్రియర్‌ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలు నచ్చడంతో విమానంలో ఒకదాన్ని తనతో పాటు ఢిల్లీకి తీసుకుని వెళ్లారు.

ఆ తరువాత మరో కుక్క పిల్లను కూడా ఆయన గోవా నుంచి తెప్పించుకున్నారు. ఆయన తీసుకుని వచ్చిన కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టారు. దాన్ని నేరుగా తన ఇంటికి వెళ్లి సోనియాకి బహుమతిగా ఇచ్చారు. అయితే నూరీ కంటే ముందుగానే సోనియా ఇంటిలో మరో కుక్క పిల్ల ఉంది. దానతో నూరి కలిసి పోయి ఆడుకుంటుందని సోనియా తెలిపారు.

రాహుల్‌ గోవాలో కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన దగ్గరి నుంచి నూరీని తనతో పాటు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇవ్వడం వరకూ రూపొందించిన వీడియోను రాహుల్ ఈ రోజు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు.

Advertisment
తాజా కథనాలు