Least Corrupt Countries 2023 Ranks:2023వ సంవత్సరానికి సంబంధించి ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో అత్యంత తక్కువ అవినీతికి పాల్పడుతున్న దేశాల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దేశాలు 50 కంటే తక్కువ స్కోర్ చేశాయి. ఇందులో మొత్తం 180 దేవాలను పరిగణలోకి తీసుకుంది. ప్రభుత్వ రంగంలో అవినీతిని సున్నా స్థాయి నుంచి 100 వరకు ర్యాంకింగ్ ఇచ్చింది. దాని ప్రకార ఏ దేశం ఏ స్థానంలో ఉందో లిస్ట్ తయారు చేసింది.
Also read:China border:చైనా సైనికులను ఎదిరించి నిలిచిన భారత గొర్రెల కాపరులు
వరల్డ్‌లో అత్యల్ప అవినీతి దేశాలు..
తక్కువ అవినీతి నమోదు చేసుకున్న దేశంగా వరుసగా ఆరవసారి కూడా డెన్మార్క్ 90స్కోరుతో అగ్రస్థాంలో ఉంది. దీని తర్వాత ఫిన్లాండ్ 87 పాయింట్లతో రెండవ స్థానంలో, 85 పాయింట్లతో న్యూజిలాండ్ మూడవ స్థానంలోనూ నిలిచాయి. తరువాతి స్థానాల్లో నార్వే 84 పాయింట్లు, స్వీడన్ 82, నెదర్లాండ్స్ 79, జర్మనీ 78, లక్సెంబర్గ్ 78 పాయింట్లతో ఉన్నాయి.
అత్యంత అవినీతి ఎక్కువ ఉన్న దేశాలు..
ఇక వరల్డ్‌లో అత్యంత అవినీతి ఎక్కువ ఉన్న దేశాల్లో సోమాలియా అన్నింటికన్నా ముందుంది. కేవలం 11 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది సోయాలియా. దీని తర్వాత వెనిజులా 13, సిరియా 13, దక్షిణ సుడాన్ 13, యెమెన్ 16 పాయింట్లతో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలు దీర్ఘకాలికంగా సంక్షోభంలో ఉండడమే కాకుండా...ఇక్కడ సాయుధ పోరాటాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. వీరు ఆర్ధికంగా చాలా వెనుకబడి ఉండడం కూడా కరెప్షన్‌కు ఒక కారణం అయింది. ఇక ఇండెక్స్‌లో 172 స్కోరుతో ఉత్తర కొరియా కూడా దిగువన ఉంది.
భారత్ స్థానం ఎక్కడంటే...
కరెప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో ఇండియా కేవలం 39 పాయింట్లు మాత్రమే సంపాదించగలిగింది. దీంతో అవినీతి అవగాహన సూచికలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. ఇంతకు ముందుకూడా ఇండియా ఇదే స్థానాల్లో ఉంది. 2022కి, 2023కి ఇండియాలో అవినీతిలో పెద్దగా ఏమీ మారలేదని ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక అంటోంది. 2022లో భారత్ స్కోర్ 40 పాయింట్లు. అప్పుడు మన దేశం 85వ స్థానంలో ఉంది. ఇక మన పొరుగు దేశాలు అయిన పాకిస్తాన్ 29 పాయింట్లతో, శ్రీలంక 34 పాయింట్లతో ఉన్నాయి. ఈ దేవాలు అప్పులు ఇంకా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్నాయి అని నివేదిక చెబుతోంది.