Delhi Liquor Scam: ఢిల్లీ లో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితనే (MLC Kavitha) అని సీబీఐ (CBI) ఆరోపించింది. ఆప్ కు 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత ఆధ్వర్యంలోనే జరిగినట్లు
సీబీఐ పేర్కొంది.
ఈ కేసులో ఇప్పటికే చాలా సార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ (ED), సీబీఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టి వేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వస్తుంది.ఈ క్రమంలోనే రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో బుధవారం లిక్కర్ కేసు విచారణ జరగనుంది.
బుధవారం లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ గురించి విచారణ చేపట్టనున్నారు.బుధవారం కవిత తో పాటూ ఇతర నిందితులను కూడా వర్చువల్ గా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరు పరచనున్నారు. ఈ కేసును జడ్జి కావేరి భవేజా విచారించబోతున్నారు.
Also Read: నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల!