Srisailam Dam: నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల!

ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్‌కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

New Update
Srisailam Dam: నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల!

Srisailam Dam Gates Open: ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్‌కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.

జూరాల నుంచి 2,81,196 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 1,07,246 క్యూసెక్కులతో కలిపి 3,88,442 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతున్నాయి. జలాశయ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 207.4103 టీఎంసీలుగా నమోదైంది.

తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో గడిచిన 24 గంటలలో 35,315 క్యూసెక్కుల నీటితో 18.437 మిలియన్‌ యూనిట్‌ విద్యుత్తు ఉత్పత్తిని, కుడిగట్టు జల విద్యుత్తు కేంద్రంలో 25,684 క్యూసెక్కుల నీటితో 15.201 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తిని చేస్తూ దిగువ సాగర్‌కు 60,999 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడుకు 20,917 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 1600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: అయోధ్య యాత్రలో విషాదం..సరయూ నదిలో జనగామ బాలిక గల్లంతు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు