Liquor Scam Case : లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు బిగ్ రిలీఫ్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia) కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం తీహార్ జైలులో కవిత కూడా త్వరలో బెయిల్ పై బయటకు వస్తుందనే చర్చ రాజకీయాల్లో మొదలైంది. అయితే, కవిత బయటకు వస్తుందని సూచనలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఆర్టీవీ చెప్పిందేనా?
త్వరలో బీజేపీ (BJP) లో బీఆర్ఎస్ (BRS) పార్టీ విలీనం అవబోతుందనే వార్తను తెర పైకి తెచ్చి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది ఆర్టీవీ. ఇప్పటికే విలీనం ప్రక్రియ మొదలు కాగా.. ఢిల్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేసుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు దేశ రాజధానిలో చర్చ జరుగుతోంది. బీజేపీ విలీనంతో కవిత అప్రూవర్ గా మారి జైలు నుంచి బయటకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల సీబీఐ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కవిత వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విలీనం జరిగితే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండబోరు అనే చెప్పుకునే సామెతకు వీరు న్యాయం చేసినట్లు అవుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయో వేచి చూడాలి మరి.
Also Read : జగన్ ఆ బిల్లును వ్యతిరేకించేది కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకా.. ఆ ఓటు బ్యాంకు కోసమా ?