నేడు వరల్డ్ స్ట్రోక్ డే.. రాకూడదంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

గుండె పోటు ప్రమాదాలు రాకుండా అవగాహన కల్పించాలని ప్రతీ ఏడాది అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేను జరుపుకుంటారు. ఈ గుండె ప్రమాదాలు రాకుండా ఉండాలంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు పోషకాలు ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి.

author-image
By Kusuma
Heart Strokes: 45 ఏళ్ల లోపు వారికి గుండెపోటు రావడానికి కారణం ఇదే.. సంచలన వివరాలు వెల్లడించిన డాక్టర్..!
New Update

ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు బారిన పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న చిన్న పిల్లలు కూడా అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మరణిస్తున్నారు. అయితే అందిరికి గుండె పోటు గురించి అవగాహన కల్పించి, దాని ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ప్రతీ ఏడాది అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే జరుపుకుంటారు. దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే గుండె పోటు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. 

ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ

శారీరక ఆరోగ్యం

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. వాకింగ్ చేయడం, స్విమ్మింగ్, సైకిలింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. 

ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..!

మానసిక ఆరోగ్యం
ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా సంతోషంగా ఉంటే హార్ట్ స్ట్రోక్ నుంచి కాస్త విముక్తి చెందవచ్చు. 

ఇది కూడా చూడండి:  ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్

పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి
పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారం తీసుకోకుండా బయట దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల గుండె పోటు వస్తుంది. వీటితో పాటు మద్యపానం, ధూమపానం వల్ల కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. కాబట్టి పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.  

ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు

ఆరోగ్యమైన నిద్ర
నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. ఒక్క రోజు నిద్ర లేకపోతే నీరసం, అలసటగా ఉండటంతో పాటు ఏ పని కూడా సక్రమంగా చేయలేరు. దీంతో పాటు గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర తప్పనిసరి. రోజుకి 8 గంటలు నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదాల నుంచి బయటపడతారు. 

#health-tips #life-style #heart-strokes #world-stroke-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe