/rtv/media/media_files/2025/10/21/white-hair-control-2025-10-21-17-07-23.jpg)
White Hair Control
ప్రస్తుతం చాలా మందిని తెల్ల వెంట్రుకల సమస్య ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు కేవలం వయస్సు పెరిగితేనే తెల్ల వెంట్రుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు అనారోగ్య సమస్యలు పెరిగిపోవడంతో.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ తెల్ల వెంట్రుకలు సమస్యగా మారాయి. అయితే మొదట ఈ తెల్ల వెంట్రుకలు కొన్ని మాత్రమే కనిపిస్తాయి. దీంతో చాలా మంది తెల్ల వెంట్రుకలను పీకడం ప్రారంభిస్తారు.
అయితే తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల మరిన్ని ఎక్కువ తెల్ల వెంట్రుకలు మొలుస్తాయని ప్రజలు నమ్ముతారు. దీనిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల చుట్టుపక్కల వెంట్రుకలు తెల్లగా మారతాయా?.. అది జుట్టు కుదుళ్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చర్మ, జుట్టు నిపుణురాలు డాక్టర్ శివాంగి రాణా వివరించారు.
తెల్ల జుట్టును పీకేయాలా?
తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల చుట్టుపక్కల వెంట్రుకలు తెల్లగా మారడం.. లేదా ఒక తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల 10 నల్ల వెంట్రుకలు తెల్లగా మారడం అనే ఒక అపోహ ఉందని చర్మవ్యాధి నిపుణురాలు అన్నారు. ఇది పూర్తిగా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. నిజానికి తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు గాయం అవుతుంది. దీని ఫలితంగా మీరు పీకుతున్న వెంట్రుకలు తిరిగి పెరగవు. కాబట్టి వెంట్రుకలను ఎప్పుడూ పీకకూడదు అని తెలిపారు.
జుట్టు తెల్లగా మారడానికి కారణం?
''జుట్టు తెల్లబడటానికి సహజ వృద్ధాప్య ప్రక్రియ కారణం. వృద్ధాప్యం వల్ల మెలనిన్ తగ్గడం వల్ల జుట్టు తెల్లబడటం జరుగుతుంది. దీంతోపాటు జెనిటిక్, ఒత్తిడి, ధూమపానం, జుట్టు సంరక్షణ సరిగా లేకపోవడం, కెమికల్ ప్రొడెక్ట్స్ అధిక వినియోగం, పోషకాహార లోపాలు వంటి అంశాలు కూడా జుట్టు తెల్లబడటానికి దోహదం చేస్తాయి." అని తెలిపారు.
విటమిన్ బి-12
ఇంకా ''విటమిన్ బి12 లోపం వల్ల జుట్టు రాలడం, జుట్టు నెరవడం జరుగుతుంది. బి12 లోపాన్ని భర్తీ చేయడం వల్ల జుట్టు నెరవడాన్ని ఆపవచ్చు. జుట్టుకు నల్ల రంగును ఇచ్చేది మెలనిన్. మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు అయిన మెలనోసైట్‌ల సరైన పనితీరుకు విటమిన్ బి12 చాలా అవసరం." అని అన్నారు.
కాగా ''మీకు దాదాపు 25 సంవత్సరాల వయస్సు ఉండి, మీ జుట్టు బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తే, అది పూర్తిగా సాధారణమే. ఇది జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు. విటమిన్ బి12 లోపం వల్ల కూడా కావచ్చు." అని తెలిపారు.
గమనిక – ఈ వార్త సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మరిన్ని వివరాల కోసం నిపుణుల సలహా తీసుకోండి.
Follow Us