దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఘనంగా అమ్మవారిని పూజిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆహార నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ ఏడాది నవరాత్రి ఉత్సవాలను విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది.
ఇది కూడా చూడండి: Jammu Kashmir: జమ్ముకశ్మీర్ లో కొత్త పొత్తు పొడవనుందా?
మహాలక్ష్మీ అవతారంలో..
ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. ఆరవ రోజు ఈరోజు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ రోజు అమ్మవారికి క్షీరాన్నం, చక్కెరతో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి గజరాజు, అభయ హస్తాలు, వడ్డాణం, కర్ణాభరణాలు, ధనరాజులు, కంఠాభరణాలతో అలంకరిస్తారు. మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఇది కూడా చూడండి: వాటా డబ్బులు అడిగినందుకు.. కాళ్లు, చేతులు కట్టేసి కిరాతంగా?
మహాలక్ష్మీ అంటే మంగళప్రదాయిని అని, ఈరోజు పూజించడం వల్ల దారిద్య బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు. అమ్మవారిని ఈ రోజు పూజించేవారు ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. ఎర్ర కలువలు, ఎర్ర గులాబీలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజు ఎక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
ఇది కూడా చూడండి: జగన్ మేనమామకు టీడీపీ భారీ షాక్