Viral Video: తీర్థం అనుకుని తాగారు.. విషయం తెలిసి షాక్‌

బృందావన్ ఆలయంలో భక్తులు ఏసీ నుంచి వచ్చిన వాటర్‌ తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయ అధికారులు ముందుగా భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీకృష్ణుని పాదాల నుంచి చరణామృతం వస్తుందంటూ భక్తులంతా క్యూ కట్టారు.

New Update
Viral Video...

Viral Video

Viral Video: భక్తిలో మునిగితే లోకాన్నే మర్చిపోయేవారు ఎంతో మంది ఉంటారు. ఆలయాలకు వెళ్లారంటే తీర్థం తీసుకోకుండా బయటికి రారు. అలాంటి ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బృందావన్ ఆలయంలో భక్తులు తెలియకుండానే పవిత్రంగా భావించి ఏసీ నుంచి వచ్చిన వాటర్‌ తీసుకున్నారు. ఆలయ అధికారులు ముందుగా భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శ్రీకృష్ణుని పాదాల నుంచి చరణామృతం వస్తుందంటూ భక్తులంతా క్యూ కట్టారు.

శిల్పం నోటి నుంచి వస్తున్న నీటిని పవిత్రజలంగా...

ఆలయం వెనుక భాగంలో ఉన్న ఏనుగు శిల్పం నోటి నుంచి వస్తున్న నీటిని పవిత్రజలంగా భావించి గ్లాసుల్లో పోసుకుని తాగారు. కొందరు నెత్తిన చల్లుకున్నారు. మథుర, బృందావన్‌లోని బాంకే బిహారీ మందిర్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. అయితే అక్కడ వీడియో తీసిన వ్యక్తి భక్తులకు మీరు తాగుతున్నది తీర్థం కాదు.. ఏసీ వాటర్‌ అని చెప్పినా పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్లిపోవడం చూడవచ్చు.

https://x.com/BroominsKaBaap/status/1852949169520124098

వైద్యులు మాత్రం AC నుంచి వచ్చే నీటిని తాగవద్దని చెబుతున్నారు. ఎందుకంటే ఈ నీటిలో ఫంగస్‌, ఇన్ఫెక్షన్‌లు వస్తాయంటున్నారు. AC నీరు అనేది గాలి నుంచి సేకరించిన ఘనీభవనం, అంటే ఇది దుమ్ము, మలినాలతో కూడి ఉంటుంది. ఇవన్నీ ఇండోర్ గాలి నుంచి తీసుకోబడతాయి. యూనిట్‌లో పేరుకున్న మురికి మొత్తం ఈ నీటిలో ఉంటుందని చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

ఇది కూడా చదవండి: మనిషివా.. రబ్బరు బొమ్మవా?..బాడీని అలా తిప్పావేంటి బ్రో

ఇది కూడా చదవండి: పూజ గదిని ఇలా అలంకరించి గుడిలా మార్చుకోండి

Advertisment
తాజా కథనాలు