/rtv/media/media_files/2025/02/01/kiss-day.jpeg)
Valentines Day
Valentines Day: ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే వాలెంటైన్ వీక్ వచ్చేసింది. ప్రేమకు గుర్తుగా భావించే ఈ వాలెంటైన్ వీక్ ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలై ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చివరకు వాలెంటైన్స్ డేతో వాలెంటైన్ వీక్ ముగుస్తుంది. చివరి రోజున అంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ వాలెంటైన్ డేను ఎందుకు జరుపుకుంటారు? ఎలా ప్రారంభమైంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.
/rtv/media/media_files/2025/02/01/qrke0Np243uGwWzz6JJA.jpg)
వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు?
ప్రతీ సంవత్సరం సెయింట్ వాలెంటైన్ అనే ప్రేమికుడి జ్ఞాపకార్థం వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. సెయింట్ వాలెంటైన్ అనే సైనికుడు మూడవ శతాబ్దంలో రోమ్‌లో ప్రేమ వివాహానికి మద్దతుగా నిలిచాడు. అయితే ఆ సమయంలో చక్రవర్తి క్లాడియస్ II సైనికుల ప్రేమ వివాహాన్ని నిషేధించాడు. ప్రేమ సైనికులను కలవరపెడుతుందని రోమ్ చక్రవర్తి నమ్మాడు. దీని కారణంగా రాజు సైనికుల ప్రేమ వివాహం, నిశ్చితార్థాన్ని నిషేధించాడు.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
మరణశిక్ష
అయితే సెయింట్ వాలెంటైన్ కి రాజు నిర్ణయం అస్సలు నచ్చలేదు. రాజుకు వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించాడు. అంతేకాదు రహస్యంగా ప్రేమ వివాహం కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్‌కు మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి 14ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ప్రేమకు కోసం మరణించిన సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు.