/rtv/media/media_files/2025/02/01/rose-day.jpeg)
రోజ్ డే ( ఫిబ్రవరి 7)
శతాబ్దాలుగా గులాబీలును ప్రేమకు చిహ్నంగా చెబుతారు. ఏడు రోజుల వాలెంటైన్ వీక్ అందమైన రోజ్ డే తో ప్రారంభం అవుతుంది. ఈరోజున ప్రేమికులు ఒకరిపై ఒకరి ప్రేమను గుర్తుచేసేలా గులాబీలు ఎక్స్ ఛేంజ్ చేసుకుంటారు. ఎరుపు గులాబీలు లోతైన ప్రేమ, అంగీకారాన్ని సూచిస్తాయి.
/rtv/media/media_files/2025/02/01/propose-day.jpeg)
ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8)
ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమను అంగీకరించడానికి, సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి ప్రపోజ్ డే ముఖ్యమైనది. ఈరోజున తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.
/rtv/media/media_files/2025/02/01/chocolate-day.jpeg)
చాకొలెట్ డే (ఫిబ్రవరి 9)
చాకొలెట్ డే ప్రేమికులు ప్రేమను వ్యక్తం చేసేందుకు చాకొలెట్లు ఇచ్చుకుంటారు. చాకొలెట్లు పంచుకోవడం అనేది ఆనందాన్ని సూచిస్తుంది. అలాగే ప్రేమికుల మధ్య బంధాన్ని మరింత గాఢం చేస్తుంది.
/rtv/media/media_files/2025/02/01/teddy-day.jpeg)
టెడ్డీ డే (ఫిబ్రవరి 10)
టెడ్డీ బేర్లు సరదా, సౌకర్యం, స్నేహాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ రోజున ఎవరైనా తమ ప్రేమను వ్యక్తం చేయడానికి టెడ్డీ బేరును గిఫ్ట్ చేయడం ఒక చక్కని మార్గం, ముఖ్యంగా వారు మాటల్లో తమ భావాలను వ్యక్తం చేయడం కష్టం అనుకుంటే ఇది సరైన మార్గం.
/rtv/media/media_files/2025/02/01/promise-day.jpeg)
ప్రామిస్ డే (ఫిబ్రవరి 11)
ప్రేమ నమ్మకం, నిజాయితీ పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రామిస్ డే వాలెంటైన్ వారంలో ఒక ముఖ్యమైన రోజు. జంటలు ఒకరికొకరు అన్ని సమయాల్లో తోడుగా, అండగా ఉంటామని పామిస్ చేసుకుంటారు.
/rtv/media/media_files/2025/02/01/hug-day.jpeg)
హగ్ డే (ఫిబ్రవరి 12)
ఒక హగ్ అనేది ప్రేమ యొక్క శక్తివంతమైన వ్యక్తీకరణ. హగ్ డేలో, వ్యక్తులు తమ ప్రేమికులను వదలకుండా కౌగిలించుకుంటారు. ఇది లోతైన ప్రేమను, పరిరక్షణను చూపిస్తుంది.
/rtv/media/media_files/2025/02/01/kiss-day.jpeg)
కిస్ డే (ఫిబ్రవరి 13)
కిస్ డే అనేది భాగస్వాముల మధ్య లోతైన ప్రేమ, సన్నిహిత సంబంధాన్ని సూచిస్తుంది. ఒక కిస్ అనేది ప్రేమ భావాన్ని తెలియజేస్తుంది. భావోద్వేగ సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గంగా పరిగణించబడుతుంది.
/rtv/media/media_files/2025/02/01/valentine-week.jpeg)
వాలెంటైన్ డే (ఫిబ్రవరి 14)
వాలెంటైన్ వారం చివరి రోజు వాలెంటైన్ డే. ఈ రోజు ప్రేమికులు తమ భావాలను గిఫ్ట్లు, రొమాంటిక్ జెస్టర్స్, హృదయపూర్వక సందేశాలతో వ్యక్తం చేస్తారు.