Vaijayanti plant: వైజయంతి మాల లేదా పెర్ల్ ప్లాంట్ అని పిలువబడే ఈ మొక్కతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా దీని పువ్వులను శ్రీకృష్ణుడిని పూజించడానికి ఉపయోగిస్తారు. మొగ్గగా ఉన్నప్పుడే పూలను కోసి మాలగా తయారు చేస్తారు. దీనిని వైజయంతి మాల అని పిలుస్తారు. గ్లాస్ ల్యాండ్ ప్రాంతాలు, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుందని చెబుతారు. ముఖ్యంగా ఇది గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్క శాస్త్రీయ నామం Coix Lacryma-Jobi.
అయితే ఆయుర్వేదంలో ఈ మొక్కను చాలా ప్రయోజనకరమైనదిగా చెబుతారు. దీని పండ్లు, పువ్వులోని ఔషధ గుణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ మొక్క పండ్ల కషాయాలను తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!
వైజయంతి మాల మొక్కతో కలిగే ప్రయోజనాలు
శ్వాసకోశ సమస్యలు
ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలకు చికిత్స చేయడంలో ఈ మొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని పండ్లు ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించి.. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే!
వైరల్ ఇన్ఫెక్షన్స్
వైజయంతి మాల మొక్కలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తద్వారా ఇన్ఫెక్షన్స్, ఇతర రోగాల బారిన పడే ప్రమాద తక్కువగా ఉంటుంది. అలాగే ఈ మొక్క పండ్లలోని యాంటీ వైరల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి.
చర్మ సౌందర్యం
ఈ మొక్కలోని ఔషధ గుణాలు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదంలో ఈ మొక్క సారం చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: రింగు రింగుల జుట్టు.. వంకాయ్ కలర్ శారీ.. అనుపమను ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!