Black Gram Dal : డైలీ డైట్ లో అన్ని రకాల పోషకాహారాలు ఉండడం చాలా ముఖ్యం. వాటిని అతి ముఖ్యమైనవి పప్పులు. పప్పుల్లో పుష్కలమైన పోషకాలతో పాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కంది పప్పు, మినప్పప్పు, చెనా దాల్, మూంగ్ దాల్ ఇలా చాలా రకాల పప్పులను ఆహారంలో తీసుకుంటుంటారు. అయితే ఈ పప్పుల్లో మినపప్పును క్రమం తప్పకుండా తీసుకుంటే.. నాన్ వెజ్ కంటే ఎక్కువ బలం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తినడం వల్ల నాన్ వెజ్ మాదిరిగానే శక్తి, బలం అందుతాయట. మినపప్పులోని పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: చీరలో జూనియర్ అతిలోక సుందరి హొయలు ! ఫొటోలు చూస్తే ఫిదా
మినపప్పు మాంసంతో సమానం..
- మినపప్పులో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం,మెగ్నీషియం, సోడియం, కాపర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫోలేట్, ఐరన్, ఫ్యాట్స్, జింక్, తో పాటు అనేక ఇతర విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అంతేకాదు ఈ పప్పు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పుష్కలమైన ప్రోటీన్ కారణంగా నాన్ వెజ్ తిన్నంత బలం వస్తుంది.
- దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, మలబద్దకం, కడుపుబ్బరం, వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కడుపులో మంచి బ్యాక్టీరియాను నిర్వహించడంలో సహాయపడుతుంది. అందుకని ఈ పప్పును ఆహారంలో చేర్చుకోవడం చాలా ప్రయోజనకరం.
- మిగతా పప్పుల కంటే మినపప్పు తీసుకోవడం ద్వారా పైల్స్, శ్వాస సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలను నియంత్రించవచ్చు. ఈ పప్పులోని అధిక ఫైబర్ మధుమేహంతో బాధపడేవారికి చాలా మేలు చేస్తుంది.
- బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పులు సరైన ఎంపిక. దీనిలోని అధిక ఫైబర్ కారణంగా ఆకలి అనే భావన త్వరగా ఏర్పడదు. ఇది పరోక్షంగా శరీరంలో కేలరీ ఇంటెక్ ను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మినపప్పులోని పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
Also Read : మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: అధిక దాహం, ఆకలి, విపరీతమైన చెమట ఉందా ? ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసా
Also Read : శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?