ఈ ఆకులతో ఇలా చేస్తే.. అందం మీ సొంతం

చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి తులసి ఆకులు బాగా ఉపయోగపడతాయి. తాజా తులసి ఆకుల్లో రోజ్‌వాటర్, తేనె, పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. వారానికొకసారి ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు తొలగి అందంగా కనిపిస్తారు.

Vastu Tips : తులసి దగ్గర ఈ 6 వస్తువులను ఎప్పుడూ ఉంచొద్దు...జాగ్రత్త!
New Update

అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందులోనూ అమ్మాయిలు అయితే చెప్పక్కర్లేదు. ముఖ సౌందర్యానికి ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం కంటే సహజ చిట్కాలను పాటిస్తే చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. తులసి మొక్క చాలా మంది ఇంట్లో ఉంటుంది. ఆ ఆకులను ఉపయోగించి చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు. ఎలాగో మరి తెలుసుకోవాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

ముడతలు, మొటిమలు లేకుండా..

చర్మాన్ని అందంగా ఉంచుకోవడంలో తులసి ఆకులు బాగా ఉపయోగపడాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మొటిమలను తగ్గించడంలో చాలా సాయపడతాయి. అలాగే ముఖంపై ఎలాంటి మచ్చలు రాకుండా కాపాడుతుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు తొందరగా ముసలితనం రాకుండా కాపాడుతుంది. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో కాస్త పసుపు, పెరుగు, రోజ్ వాటర్, తేనె కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరిసిపోతుంది. 

ఇది కూడా చూడండి:  Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

తులసి ఆకులను ఎండబెట్టి మాత్రమే కాకుండా తాజా ఆకులతో కూడా తయారు చేసుకోవచ్చు. తాజా తులసి ఆకులను తీసుకుని పేస్ట్ చేసుకుని కూడా ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరవడంతో స్కిన్‌పై ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది.  

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

#tulasi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe