తిరుపతిలోని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి. ఎనిమిది రోజుల నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పెద్దశేష వాహనంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం సమయాల్లో తిరుమాఢవీధుల్లో శ్రీవారు రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చూడండి: చెన్నై-విజయవాడ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
ఘనంగా చక్రస్నానం..
స్వామి వారు శ్రవణా నక్షత్రంలో అర్చావతారంలో భూలోకంలో ఆవిర్భవించడంతో ఈ రోజును ఎంతో పుణ్యదినంగా భావిస్తారు. అలాగే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు, చక్రతాళ్వారులను వరహస్వామి వారిని ముఖ మండపానికి తీసుకువస్తారు. ఆ తర్వాత ఉభయ దేవేరులతో నున్న శ్రీవారి సరసన చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. శ్రీవారిని పవిత్ర జలాలతో, పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు.
ఇది కూడా చూడండి: జ్ఙాపకశక్తి మందగిస్తుందా..అయితే ఎయిర్ ఫ్రెషనర్లు కూడా కారణం కావొచ్చు!
స్వామివారి పుష్కరణిలో అవభృత స్నానంతో చక్రతాళ్వార్లకు చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ చక్రస్నానం జరిగిన రోజున పుష్కరణిలో భక్తులు స్నానాలు చేస్తే సకలమైన పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆ తర్వాత రాత్రి ఏడు గంటలకు ఉభయదేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి బంగారు తిరుచ్చిపై నాలుగు మాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే?