జ్ఙాపకశక్తి మందగిస్తుందా..అయితే ఎయిర్‌ ఫ్రెషనర్లు కూడా కారణం కావొచ్చు!

ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్‌ వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉందని "ఎనర్జీ ప్రాక్టీషనర్" లిన్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సువాసన గల కొవ్వొత్తులు, ఫీబ్రీజ్, డ్రైయర్ షీట్లు, అన్నీ రసాయనాలతో కలిపినవి" అని ఆమె వివరించారు.

New Update
brain

Air Freshners: ఇంటిలో సువాసనలు వెదజల్లేందుకు ఉపయోగించే సువాసన గల క్యాండిల్స్‌, డ్రయ్యర్‌ షీట్‌ లు, ప్లగ్‌ ఇన్‌ ఎయిర్‌ ఫ్రెషనర్లు వాడుతుంటాం. కానీ దాని వల్ల ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామో నిపుణులు వివరించారు.  ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్‌ వల్ల  జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉందని "ఎనర్జీ ప్రాక్టీషనర్" లిన్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

Also Read: ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో పిడుగులు, అతి భారీ వర్షాలు!

ఆ వీడియోలో ఆమె మెదడును ప్రభావితం చేసే రసాయనాలను వెంటనే మీ ఇంటి నుంచి బయటకు తీయండి. మీరు రోజూ ఉపయోగించే సాధారణ వస్తువుల వల్ల జ్ఙాపకశక్తి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. అసలు ఆమె ఈ విషయం గురించి ఎందుకు చెప్పారంటే...కొద్దిరోజుల క్రితం లిన్‌ తన స్నేహితులతో కలిసి వారాంతాన్ని ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లారు.అక్కడ ఓ కుటీరం లో ఉన్నారు. ఆ సమయంలో  "నా స్నేహితురాలు కొన్ని పదాలను మరచిపోతున్నట్లు నేను గమనించాను." తను ప్రతి పదాల తరువాత ఓ పదాన్ని వెతుక్కునే సందర్భం వచ్చినట్లు లిన్‌ వివరించారు.

Also Read: బెజవాడ కనక దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు..ఎందుకంటే!

ఇంతకు ముందు ఎప్పుడు కూడా తన స్నేహితురాలి విషయంలో ఇలా జరగలేదు. ఇది కొత్తగా వచ్చినట్లు నేను గమనించాను. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో కనుగొనే ప్రయత్నంలో ఆమె ఇంటి చుట్టూతో పాటు ఇంటి లోపల కూడా చాలా ప్లగ్‌ ఇన్‌ ఎయిర్‌ ఫ్రెషనర్లును నేను గుర్తించాను. 

వాటి వల్లే మెదడు మీద తీవ్ర మైన ప్రభావం పడినట్లు గుర్తించాను. అవి జ్ఙాపకశక్తిని కోల్పోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసే పరిస్థితులను ఏర్పరిచినట్లు గుర్తించాము.ఆ ఫ్రెషనర్లలో ఉండే రసాయనాలు మెదడుని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలున్నట్లు వారు గుర్తించారు. 

ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్‌లలోని రసాయనాలు మీ మెదడు పనితీరును తీవ్రంగా మార్చగలవని లిన్‌ పేర్కొంది. అందుకే తన స్నేహితురాలు జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు తెలుస్తుందని వివరించారు.

Also Read: డోనాల్డ్ ట్రంప్ ప్రకటనపై కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్

ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు ప్రమాదకరమా?


ఈ క్రమంలోనే  మరొక నిపుణుడు "గ్లేడ్ వంటి ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు" తరచుగా అస్థిర కర్బన సమ్మేళనాల  రూపంలో హానికరమైన టాక్సిన్‌లను కలిగి ఉంటాయని చెప్పారు. ఈ VOCలలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోలున్, జిలీన్ ఉన్నాయని వివరించారు. UMass అమ్హెర్స్ట్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రకారం, ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్‌లలో ఎక్కువ భాగం "ఫార్మల్‌డిహైడ్, ఎసిటాల్డిహైడ్, బెంజీన్, టోలుయెన్, ఇథైల్ బెంజీన్,  జిలీన్‌లు" వంటి ఎలివేటెడ్ స్థాయి VOCలతో సంబంధం కలిగి ఉంటాయి.

Also Read: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే?

"మైగ్రేన్ తలనొప్పి, ఉబ్బసం దాడులు, శ్వాస శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ సంబంధిత వ్యాధులు,  ముఖ్యంగా సున్నితమైన వ్యక్తులకు నరాల సంబంధిత సమస్యలు" వంటి "సాపేక్షంగా తక్కువ స్థాయిలో కూడా ఈ రసాయనాలకు గురికావడం అనేక రకాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో ముడిపడి ఉందని తెలిసింది.

VOCల వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందా?


ఒక వ్యక్తి అధిక స్థాయి VOCలకు గురైనట్లయితే, వారు "పరస్పర, భ్రాంతులు, ప్రేరణ నియంత్రణ కోల్పోవడం, చిత్తవైకల్యం, శ్వాసకోశ ప్రభావాలతో సహా అనేక న్యూరోసైకియాట్రిక్ రుగ్మతల" ప్రమాదంలో ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు.

తన వీడియోను ముగించే ముందు, లిన్ తన స్నేహితురాలి ఇంటిని అన్ని రసాయనాల నుంచి శుభ్రం చేయడమే మొదటి కర్తవ్యం అని చెప్పింది. "మీఇంట్లో కూడా అలాంటివి ఉంటే వెంటనే వాటిని మీ ఇంటి నుండి తీసివేయండి. దాని వల్ల మీ మెదడు పని తీరు మారుతుంది" అని చెప్పుకొచ్చింది. 

"ప్లగ్-ఇన్‌లు నా తలకు చాలా బాధ కలిగించాయి" అని లిన్ వీడియో కి కామెంట్‌ పెట్టారు. "సువాసన గల కొవ్వొత్తులు, ఫీబ్రీజ్, డ్రైయర్ షీట్లు, అన్నీ రసాయనాలతో కలిపినవి" అని లిన్ది చెప్పుకొచ్చారు. ఇతర ఎయిర్ ఫ్రెషనర్‌లతో పోల్చితే Febreze అతి తక్కువ మొత్తంలో VOCలను కలిగి ఉన్నప్పటికీ, Febreze వల్ల కలిగే "గరిష్ట సాంద్రత" 580 ppb అని AirScan నిర్ధారిస్తుంది.నేషనల్ క్యాండిల్ అసోసియేషన్ "కొవ్వొత్తిలోని దాదాపు అన్ని సువాసన పదార్థాలు VOCలు" అని పేర్కొంది. 

డ్రైయర్ షీట్‌ల విషయానికొస్తే, డ్రైయర్ షీట్‌లను తయారు చేయడానికి ఉపయోగించే సువాసనలు "వందలాది రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటాయి, వాటిలో చాలా ప్రమాదకరమైనవి" అని స్మార్ట్ షీప్ డ్రైయర్ బాల్స్ పేర్కొంది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు