తెలంగాణ ప్రతీక బతుకమ్మ విశిష్ఠత తెలుసా..?

ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. ఇలా బతుకమ్మ వేడుకలో ఉపయోగించే పూవుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

author-image
By Vijaya Nimma
Bathukamma
New Update

Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక బతుకమ్మ. ఆడబిడ్డలంతా సంబురంగా జరుపుకొనే ఘనమైన వేడుక ఇది. ప్రకృతిని ఆరాధిస్తూ సాగే పూల పండుగ బతుకమ్మ. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో మరెక్కడా కనిపించని, తెలంగాణకు మాత్రమే సొంతమైన వినూత్నమైన, అరుదైన పూలవేడుక బతుకమ్మ. పూలతో దేవుడిని కొలవడం కాదు.. పూలనే దేవుడిలా కొలిచే వేడుక ఇది. బతుకమ్మ అంటే బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ అని అర్థం. తొమ్మిది రోజులు తెలంగాణ అంతటా ఒక జాతరలా సాగి చివరిరోజు సద్దుల బతుకమ్మగా మన వాకిట్లో బతుకుదెరువును ఆవిష్కరిస్తుంది. ఆటపాటలతో మనల్ని సేదతీరుస్తుంది. జీవన సంబురాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో మాత్రమే జరుపుకొనే పండుగ బతుకమ్మ. స్వరాష్టంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొంది నేడు ప్రపంచంలో తెలంగాణవారున్న చోటల్లా పూలజాతరై వర్ధిల్లుతోంది. ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి వాడవాడలా నిర్వహించే ఉత్సవమే బతుకమ్మ. 

ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ..

బతుకమ్మ వేడుకను ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య లేదా పెత్రమాస రోజు నుంచి అశ్వయుజ అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ సంబురం కొనసాగుతుంది. ఆడబిడ్డలంతా చివరి రోజు అశ్వయుజ అష్టమి నాడు ఉపవాసం పాటిస్తూ, స్నానాధికాలు ముగించుకుని, ముందుగా చిన్న బతుకమ్మను పేరుస్తారు. గౌరమ్మను నిలుపుకొంటారు. అంతేకాకుండా సద్దులు సమర్పిస్తారు. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వునూ ఏరికోరి తెచ్చి, బతుకమ్మలను పేరుస్తారు. అంతేకాకుండా బతుకమ్మ వేడుకలో ఉపయోగించే పూవుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. పూల నుంచి వచ్చే పరిమళాలు, వాటి లేలేత స్పర్శ ఆరోగ్యాన్ని పెంచుతాయన్నది నిపుణుల మాట. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన గౌరమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ ఆడే వేడుక బతుకమ్మ.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: నడకతో బరువు తగ్గొచ్చా.. నమ్మలేని నిజాలు

#life-style #telangana-festivals #Bathukamma 2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe