/rtv/media/media_files/WFWwk2rEGcS3an978pmc.jpg)
Walking: బరువు తగ్గాలంటే జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని. సింపుల్ మార్గాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. జిమ్ కంటే కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా నడిచినా అంతే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. వ్యాయామంగా మెట్లు ఎక్కడం. చదునైన నేలపై నడవడం ఎంతో మంచిదని చెబుతున్నారు.
మెట్లు ఎక్కడం మంచి వ్యాయామం:
మెట్లు ఎక్కడం అనేది వేగంగా బరువు తగ్గే మార్గం. దీని వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. రోజుకు ఎన్ని కేలరీలు బర్న్ చేస్తున్నామో చూసుకోవడం కూడా ముఖ్యమే. ఎంత బరువు ఉంటే అంత ఎక్కువగా కేలరీలు బర్న్ చేయాలని నిపుణులు అంటున్నారు. నడక కంటే మెట్లు ఎక్కడం వల్ల దాదాపు 20 రెట్లు ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. మెట్లు దిగడం ద్వారా కూడా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. మెట్లు ఎక్కడం అనేది మనలో ఎవరైనా చేయగలిగే సాధారణ వ్యాయామం. ఏదైనా ఎత్తైన భవనంలోకి వెళితే ఎలివేటర్లు వాడే కంటే మెట్లు ఎక్కితే మంచి వ్యాయామం అవుతుందని నిపుణులు అంటున్నారు.
అదనపు బలం చేకూరుతుంది:
తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు ఖర్చు చేయడంలో మెట్లు ఎక్కడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మెట్లు ఎక్కడానికి రెండు చేతులను ఉపయోగించడం వల్ల అదనపు బలం చేకూరుతుందని పరిశోధకులు అంటున్నారు. ప్రతిసారీ మెట్లు ఎక్కి దిగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ టీ తాగితే గుట్టలాంటి పొట్టైనా ఇట్టే కరిగిపోద్ది