టాబ్లెట్స్‌కి పేరు ఎలా పెడతారు..వాటిపై ఉండే కోడ్‌కు అర్థం

చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడుతుంటారు. కొన్ని ఔషధాల పేర్లు, కోడ్‌ చాలా విచిత్రంగా ఉంటాయి. ఔషధానికి పేరు పెట్టే ప్రక్రియ సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనదగా ఉంటుందట. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Tablets..

Tablets

New Update

Tablets: చాలా ఇళ్లలో చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడుతుంటారు. అయితే ఔషధాల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రజలు వాటిని తరచుగా అర్థం చేసుకోలేరు. USలో ఔషధం ఆమోదించబడినప్పుడు దానికి సాధారణ పేరు పెడుతారు. ఆ తర్వాత బ్రాండ్ పేరు యాడ్‌ చేస్తారు. ఉదాహరణకు ఫెనిటోయిన్ అనేది సాధారణ పేరు. డిలాంటిన్ అనేది అదే ఔషధం బ్రాండ్ పేరు. చాలా సందర్భాలలో ఔషధాలకు రసాయన పేరు, సాధారణ, బ్రాండ్ పేరుతో సహా మూడు రకాల పేర్లు ఉంటాయి.

ఇది కూడా చదవండి: మీకు ఎంతో ఇష్టమైన ఈ సబ్బుకు ప్రపంచ యుద్ధంతో లింక్‌ ఉందని తెలుసా?

ఔషధ హోదా ప్రక్రియ:

అయితే మరే కంపెనీకి లేని పేరు తెచ్చుకోవాలని Qs, Xs, Zs అంటూ కొన్ని కంపెనీలు పేర్లు పెడుతుంటాయి. ఔషధానికి పేరు పెట్టే ప్రక్రియ సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనది. ఔషధాన్ని ఏజెన్సీ ఆమోదించడానికి ముందు ఔషధ హోదా ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనేక సందర్భాల్లో పేరు ఎంపిక, ఆమోద ప్రక్రియకు గరిష్టంగా నాలుగు సంవత్సరాలు పట్టవచ్చు. టాబ్లెట్స్‌ స్ట్రిప్‌ మీద తయారీ, గడువు తేదీని తప్పకుండా రాస్తారు. అంతేకాకుండా ధర కూడా ఉంటుంది. వైద్యంలో ఉపయోగించే ఇంగ్రిడియన్స్‌ కూడా రాస్తారు. 

ఇది కూడా చదవండి:  పసుపు బెల్లం కలిపి తింటే.. ఆ నొప్పులన్నీ మాయం

చాలా మంది వైద్యులను వాడకుండా సొంత వైద్యం చేసుకుంటారు. కాబట్టి కంపెనీలు కొన్ని మందులపై రెడ్ బార్‌ను రాస్తాయి. అంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే ఈ మందులు వాడాలని అర్థం. అలాగే.. కొన్ని మందులకు పేరు పైభాగంలో Rx గుర్తు ఉంటుంది. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన రోగికి మాత్రమే ఈ ఔషధం ఇవ్వబడుతుంది. NRx అంటే అటువంటి మందులను సూచించడానికి లైసెన్స్ పొందిన వైద్యుడు మాత్రమే వాటిని తీసుకోవాలని సూచించవచ్చు. XRx సూచించినప్పుడు ఆ టాబ్లెట్స్‌ మెడికల్ స్టోర్‌లో లభించవు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి:  నేరేడు పండుతో రక్తపోటు నియంత్రణ సాధ్యమా?

#tablets #names of medicines
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe