Turmeric: పసుపు బెల్లం కలిపి తింటే.. ఆ నొప్పులన్నీ మాయం పసుపు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి వల్ల జీర్ణవ్యవస్థ, వాపు, నొప్పి, జలుబు, దగ్గు, పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధకశక్తి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Turmeric షేర్ చేయండి Turmeric: ఆయుర్వేదంలో పసుపు, బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పని చేస్తాయి. ఈ రెండు వంటగదిలో సులభంగా ఉండే పదార్థాలు. రెండూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. బెల్లం చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. మరోవైపు పసుపులో ప్రధాన పదార్ధం కర్కుమిన్. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. బెల్లంలో ఐరన్, పొటాషియం, ఖనిజాలు ఉంటాయి. బెల్లం, పసుపు కలిపి తింటే మంచిదని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. శరీరం లోపల ఏదైనా గాయం అయితే బెల్లం, పసుపు తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండింటి కలయిక అనేక ఆరోగ్య సమస్యలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి అధికం: పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పసుపులో బెల్లం కలిపి తింటే శరీరానికి ఇన్ఫెక్షన్ సోకదు. చలికాలంలో జలుబు, దగ్గు, ఉంటే దీనిని తినటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ: బెల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరచటంతోపాటు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. పసుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం, పసుపు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. రక్తాన్ని శుద్ధి: బెల్లం రెగ్యులర్‌గా తింటే రక్తాన్ని శుద్ధి అవుతుంది. శరీరంలో ఉన్న మలినాలు తొలగిస్తుంది. పసుపు రక్తాన్ని పలుచ పడేలా చేసి గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. వాపు-నొప్పి తగ్గుతుంది: పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అల్సర్‌ను ప్రభావవంతంగా తగ్గిస్తాయి. పసుపు, బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో మంట, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది ఆర్థరైటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ సమస్య మాయం: బెల్లం, పసుపు వల్ల స్త్రీలలో రుతు సమయంలో కడుపు నొప్పిని తగ్గిస్తుంది. బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత తగ్గేలా చేస్తుంది. జలుబు-దగ్గు ఉపశమనం: జలుబు, దగ్గు ఉంటే బెల్లం, పసుపు తినటం వల్ల గొంతులో ఉపశమనం కలగటంతోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది. చర్మానికి మేలు: పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని కాంతివంతం చేసి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది. బెల్లం చర్మానికి పోషణ ఇవ్వటంతోపాటు మొటిమలను తగ్గిచడం కూడా సహాయపడుతుంది. వాడే పద్దతి: బెల్లం, పసుపును నీటిలో కలిపి తీసుకోవచ్చు లేదా నేరుగా తినవచ్చు. పాలల్లో కలిపి తీసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం అవుతాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ఈ వాటర్ తాగితే వారంలోనే శరీరంలో మార్పు ఖాయం #turmeric మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి