మీకు ఎంతో ఇష్టమైన ఈ సబ్బుకు ప్రపంచ యుద్ధంతో లింక్ ఉందని తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో మైసూరులో గంధపు చెక్కల కుప్పలుగా పేరుకుపోయాయి. అక్కడే మొదలైంది మైసూర్ సాండల్ సోప్ జర్నీ.. పూర్తి సమాచారం కోసం ఆర్టిక్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 21 Nov 2024 in లైఫ్ స్టైల్ Short News New Update Mysore Sandal Soap షేర్ చేయండి Mysore Sandal Soap: మైసూర్ సాండల్ సోప్.. ఈ సబ్బు గురించి ఆలోచించగానే మనకు వెంటనే గుర్తొచ్చేది చక్కని సాండల్ సువాసన. ఈ సబ్బు ప్రత్యేకత దాని పరిమళమే. 100శాతం స్వచ్ఛమైన సాండల్‌వుడ్ ఆయిల్‌తో తయారయ్యే ఈ సబ్బు చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వడం పక్కా! ఎందుకంటే ఈ సబ్బు పుట్టింది మొదటి యుద్ధం కారణంగా అని చాలా మందికి తెలియదు. తొలి ప్రపంచ యుద్ధ కాలం నుంచే ఈ సబ్బు సువాసన వెదజల్లడం ప్రారంభించింది! ఏంటి నమ్మడం లేదా? చాలామంది ఫేవరెట్ సోప్‌కు కోట్లాది మరణాలకు కారణమైన ఫస్ట్ వరల్డ్ వార్‌కి లింకేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ సబ్బు పుట్టుక వెనుక ఉన్న అసలు కథను తెలుసుకోండి! వాణిజ్యం దెబ్బతో సబ్బుకి పేరు: 1914లో ప్రారంభమైన తొలి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా వాణిజ్యం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు యూరోప్ దేశాలు భారత్ నుంచి ఎగుమతి చేసుకునే సాండల్‌వుడ్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని తగ్గించాయి. దీంతో మైసూరు ప్రాంతంలో పెద్ద మొత్తంలో సాండల్‌వుడ్ నిల్వలు పోగయ్యాయి. ఆ సమయంలో మైసూర్ మహారాజుకు ఓ ఐడియా వచ్చింది. ఈ సాండల్‌వుడ్ నిల్వను వృథా కాకుండా చేయాలని ఓ ప్రణాళిక వేశారు. 1916లో సాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనే పేరుతో బెంగళూరులో ఒక ఫ్యాక్టరీని ప్రారంభించారు. అక్కడ సాండల్‌వుడ్ ఉపయోగించి ఆయిల్‌ను తయారు చేసి, దీన్ని సబ్బు తయారీలో వాడడం మొదలుపెట్టారు. అలా సాండల్ ఆయిల్‌తో సబ్బు తయారీ స్టార్ట్ అయ్యింది. సువాసతో ప్రత్యేకం..1918లో మైసూర్ సాండల్ సబ్బును మార్కెట్లో ప్రవేశపెట్టారు. 100శాతం సాండల్ ఆయిల్‌తో తయారు చేసిన ఈ సబ్బు తన ప్రత్యేక సువాసనతో ప్రజల మనసులను కొల్లగొట్టింది. ఈ సువాసన ఇతర సబ్బులతో పోల్చితే చాలా ప్రత్యేకం కావడంతో ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున కొనడం మొదలుపెట్టారు. ఇటు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల్లోనూ ఈ సబ్బు మంచి ఆదరణ పొందింది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ సబ్బును గిఫ్ట్‌గా ఇచ్చేవారి కూడా ఉన్నారు. బెస్ట్ క్వాలిటీ సోప్‌గా రికార్డ్: దేశంలో BIS-Bureau of Indian Standards సర్టిఫికేట్ పొందిన తొలి సబ్బు ఇది. ఏ ఇతర కల్తీ పదార్థాలు లేకుండా, కేవలం సాండల్ ఆయిల్‌తోనే తయారయ్యే ఈ సబ్బు భారత్‌లో అత్యంత ఖరీదైన సబ్బుల్లో ఒకటి. TFM పర్సెంటేజే అంటే టోటల్ ఫాటీ మేటర్ 80శాతానికి పైగా ఉన్న అతి తక్కువ సోపుల్లో ఈ సబ్బు కూడా ఉంది. సోప్ ప్యూరిటీని నిర్ధారించేది ఈ TFM పర్సెంటేజే. ఇలా బెస్ట్ క్వాలిటీ కలిగిన సోప్‌గా మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న ఈ సబ్బుకు మొదటి ప్రపంచ యుద్ధంతో అనుబంధం కలిగి ఉండడం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్..! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఇది కూడా చదవండి: చలికాలంలో భోజనం ఎక్కువసేపు వేడిగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి #soap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి