ఈ వెల్లుల్లి కేజీ ధర తెలిస్తే షాక్ కావాల్సిందే!

కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువగా పండించే కశ్మీరీ వెల్లుల్లితో అధిక కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, గుండె సమస్యల నుంచి విముక్తి కావచ్చు. అయితే ఈ వెల్లుల్లి ధర కేజీ దాదాపుగా రూ.2400 ఉంటుంది. అదే నాణ్యమైనదైతే కేజీ ధర రూ.3000 పైమాటే.

New Update

Kashmiri garlic: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా వెల్లు్లి అయితే తక్కువ రేటు ఉంటుంది. అదే సూపర్ వెల్లుల్లి అయితే కేజీ ధర తెలిస్తే షాక్ కావాల్సిందే. మీరు ఎప్పుడైనా మార్కెట్‌కి వెళ్తే తప్పకుండా ఈ సూపర్ వెల్లుల్లిని కచ్చితంగా కొనండి. ఎందుకంటే ఇది కేవలం మసాలా మాత్రమే కాదండోయ్.. ప్రాణాలను రక్షించే దివ్య ఔషధం. అయితే ఈ సూపర్ వెల్లుల్లిని కశ్మీరీ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు.

ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి

ఈ సూపర్ వెల్లుల్లిని తినడం వల్ల రక్తనాళాల్లో సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, గుండె జబ్బులను నయం చేయగల శక్తి ఉంది. అలాగే శరీర శక్తిని పెంచడంలో కూడా వెల్లుల్లి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధుల నుంచి కూడా విముక్తి కల్పించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్

సాధారణ వెల్లుల్లి మార్కెట్‌లో కిలో రూ.350 నుంచి రూ.450 వరకు ఉంటుంది. కానీ, ఈ కశ్మీరీ వెల్లుల్లి మాత్రం కిలో రూ.2400 ఉంటుంది. ఇందులో ఇంకా నాణ్యమైన వెల్లుల్లి అయితే దాని ధర చెప్పక్కర్లేదు. కేజీ ధర కనీసం రూ. 3000 పైనే ఉంటుంది. ఈ సూపర్ వెల్లుల్లి ఎక్కువగా కాశ్మీర్, హిమాచల్ వంటి ప్రాంతాల్లో పండిస్తారు. 

ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..! 

Advertisment
Advertisment
తాజా కథనాలు