వేసవిలో ఈ పదార్థాలతో జ్యూస్‌లు తాగితే.. అందమంతా మీదే

వేసవిలో క్యారెట్, బీట్‌రూట్, అల్లం, నిమ్మకాయ రసం కలిపి జ్యూస్ చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు లేకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Fruit Juice:ఈ జ్యూస్ తాగితే అంతే సంగతి.. తస్మాత్‌ జాగ్రత్త!

juices

వేసవిలో చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉండాలంటే తప్పకుండా జ్యూస్‌లు తాగాల్సిందే. కేవలం పండ్ల రసాలే కాకుండా కూరగాయల జ్యూస్‌లు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే వేటితో జ్యూ్స్‌లు తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

అల్లం

అల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. 

క్యారెట్
జ్యూస్ డైలీ క్యారెట్ జ్యూస్‌ను చేసి తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. వీటిలో పోషకాలు, విటమిన్లు చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు తయారు చేసుకునే జ్యూస్‌లో క్యారెట్ వేసి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!

బీట్‌రూట్
బీట్‌రూట్ చర్మాన్ని మెరిపిస్తుంది. నల్లగా ఉన్నవారు డైలీ ఈ జ్యూస్ తాగితే తప్పకుండా తెల్లగా అవుతారు. ఈ జ్యూస్ తాగడం వల్ల ముఖం మెరుస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరిపిస్తాయి. 

ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

నిమ్మకాయ
వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డైలీ నిమ్మరసాన్ని మీరు జ్యూస్‌లో యాడ్ చేసుకోవడం లేదా నిమ్మరసాన్ని డైరెక్ట్‌‌గా తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఈజీగా బరువు కూడా తగ్గుతారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Palmyra Palm Fruit: వీరు పొరపాటున తాటిముంజులు తిన్నారో.. పైకి పోవడం గ్యారెంటీ

తాటి ముంజులు ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు తీసుకోకూడదు. డయాబెటిస్, జీర్ణ, కాలేయ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా తినకూడదు. తింటే కొన్ని సార్లు ప్రాణలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

New Update
palmyra palm fruit

palmyra palm fruit

తాటి ముంజులు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది వేసవిలో లిమిట్ కంటే ఎక్కువగా తీసుకుంటారు. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ కొందరు మాత్రం తాటి ముంజులను అసలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొరపాటున తాటి ముంజులు తినడం వల్ల కొన్నిసార్లు సమస్య తీవ్రం అవుతుందని అంటున్నారు. అయితే ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాటి ముంజులను తీసుకోకూడదో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

డయాబెటిస్

మధుమేహంతో ఇబ్బంది పడేవారు తాటి ముంజులను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. దీంతో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వీటిని ఎప్పుడు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Kodali Nani: ఎట్టకేలకు బయటకు వచ్చిన కొడాలి నాని.. వివాహ వేడుకకు హాజరు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

జీర్ణ సమస్యలు

కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నవారు తాటి ముంజులును తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

గర్భిణులు

గర్భిణులు, పాలిచ్చే తల్లులు వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులో ఉండే ఇథనాల్ లిపిడ్ గర్భిణులకు మంచిది కాదు. దీనివల్ల శిశువులకు కడపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. 

కాలేయ సమస్యలు

కాలేయం, ఫ్యాటీ లివర్ వంటి వాటితో బాధపడుతున్న వారు తింటే సమస్యలు తప్పవు. వీటి వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

diabetic | health-issues | thati munjalu

Advertisment
Advertisment
Advertisment