తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి

వర్క్ బిజీ, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చెక్ పెట్టాలంటే ముఖ్యంగా హాయిగా నిద్రపోవాలి. వీటితో పాటు పోషక పదార్థాలు, అల్లం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం వంటివి చేస్తే తలనొప్పి తగ్గుతుంది.

New Update
morningheadache9

వర్క్ బిజీ, వ్యక్తిగత కారణాల వల్ల కొందరికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. కాస్త ప్రయాణాలు చేసిన, విశ్రాంతి లేకుండా రోజంతా పనిచేసిన కూడా తలనొప్పి వచ్చేస్తాది. దీని నుంచి విముక్తి పొందాలని మందులు కూడా వాడుతారు. అయిన కూడా కొందరికి తలనొప్పి తగ్గదు. మరి ఈజీగా తలనొప్పి తగ్గాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. ఆ చిట్కాలెంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

తగినంత నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అనేది తప్పనిసరి. నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. తలనొప్పికి చెక్ పెట్టాలంటే హాయిగా నిద్రపోవాలి. రోజుకి కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర పోతే తలనొప్పి మాయం కావడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. 

పోషకాలు ఉండే తీసుకోవాలి

పనుల్లో పడి భోజనం చేయడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే ఒత్తిడికి గురవుతారు. దీంతో తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. రోజూ పోషకాలు ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా సమయానికి తినడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. 

హైడ్రేటెడ్‌గా ఉండండి

బాడీకి సరిపడా నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనివల్ల మైకము, చిరాకు వచ్చి తలనొప్పితో ఇబ్బంది పడతారు. నిరంతరంగా తలనొప్పి ఉన్నవారు ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగితే సమస్య తగ్గుతుంది. 

అల్లం

తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభించాలంటే అల్లం ముక్కను తినడం మంచిది. అల్లం తినడం ఇష్టం లేని వాళ్లు టీలో కలిపి అయిన తీసుకోవడం వల్ల వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read :  నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Advertisment
తాజా కథనాలు