/rtv/media/media_files/2025/04/08/WKHiJSC2nYcVnoV6s9si.jpg)
Soya Milk Photograph: (Soya Milk)
శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సోయా మిల్క్ బాగా ఉపయోగపడతాయి. ఇందులోని పోషకాలు శరీరానికి తక్షణమే బలాన్ని ఇవ్వడంతో పాటు కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కొందరికి పోషకాహార లోపం ఉంటుంది. అలాంటి వారు సోయా మిల్క్‌ను డైలీ తాగితే సమస్య క్లియర్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
జీర్ణ సమస్యలను తగ్గించడంలో ముఖ్య పాత్ర..
సోయాబీన్ గింజలతో తయారు చేసే మిల్క్‌ను తాగితే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎముకలు, కండరాలకు అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించి.. జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం, విటమిన్ డి ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
డైలీ ఈ మిల్క్‌ను తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిల్క్ మొక్కల ఆధారిత పాలు. వీటివల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఇవి మార్కెట్లో కూడా లభ్యమవుతాయి. ఇవి వద్దు అనుకుంటే.. ఇంట్లోనే మీరు ఈ మిల్క్‌ను తయారు చేసుకోవచ్చు. కాకపోతే వీటిని తయారు చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అయితే సన్నగా ఉన్నవారు ఈ మిల్క్‌ను తాగితే.. ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.