Releationship: ఏకాంతంగా ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందమంటున్నారు మహిళలు. "Social Psychological and Personality Science" అనే జర్నల్‌లో ఈ అంశాలు ప్రచురితమయ్యాయి. ఒంటరితనం అనుభవిస్తున్న మహిళలు పురుషుల కంటే ఎక్కువ సంతృప్తిని పొందుతున్నారని ఓ అధ్యయనం చూపినట్లు ఈ జర్నల్‌లో పేర్కొన్నారు. చాలా మంది ఏం అనుకుంటారాంటే ఒంటరితనం అనుభవిస్తున్న మహిళలు చాలా బాధపడుతున్నారని అనుకుంటారు. కానీ అది నిజంకాదట.
పురుషుల కంటే మహిళలు
అయితే ఈ డేటాను 2020 నుంచి 2023 వ్యవధిలో జరిపిన 10 డిఫరెంట్ అధ్యయనాల నుంచి సేకరించారు. ఈ అధ్యయనంలో మొత్తం 5,941 మంది పాల్గొన్నారు. 18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై అధ్యయనం చేశారు. ఒంటరితనం అనుభవిస్తున్న మహిళలు తమ జీవితం, సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అధ్యయనంలో మహిళలు, సాధారణంగా, ఒంటరితనంలో పురుషుల కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు.
- నిజానికి ఒంటరితనంలో మీరు మీకంటూ మీకు కావాల్సిన విషయాలను గుర్తించవచ్చు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎందుకంటే మీరు మీ నిర్ణయాలకు, చర్యలకు బాధ్యత వహించేలా చేస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం మీ జీవితంలో మరింత సానుకూల దృక్పథాన్ని అందిస్తుంది.
- ఒంటరితనంలో ఉన్నప్పుడు, మీరు మీ సమాజంలో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్‌తో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపి, వారి సహాయాన్ని పొందవచ్చు.
- ఒంటరితనంలో, మీరు మీ ఆర్థిక విషయాలను స్వతంత్రంగా నిర్వహించవచ్చు. మీ ఆదాయాన్ని, ఖర్చులను మీ ఇష్టానుసారంగా సవరించుకోవచ్చు. ఇది మీకు ఆర్థిక స్వాతంత్ర్యం కలిగిస్తుంది.
- ఒంటరితనం మీకు మీ అభిరుచులు, లక్ష్యాలను సాధించడానికి సమయం ఇస్తుంది. మీకు ఇష్టమైన హాబీలను అనుసరించడం, కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందవచ్చు.
- ఒంటరితనం మీకు ప్రశాంతతను అందించవచ్చు. మీరు అవసరమైనంత సమయం తీసుకుని, మీ ఆలోచనలు, భావనలు, లక్ష్యాలపై దృష్టి పెట్టవచ్చు.
Also Read: Winter: మగవారి కంటే ఆడవాళ్ళకి చలి ఎందుకు ఎక్కువ ? కారణం తెలుసుకోండి..మీకే మంచిది