Constipation : అతిసారాన్ని అత్యంత వేగంగా తగ్గించే పండు. ఈ పండు తినడం వల్ల మలబద్దకం, విరోచనాలు, ఇతర సమస్యలు తగ్గిపోతాయి. అదే అరటిపండు, మలబద్ధకం ఉన్నవారు మల విసర్జనకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. అరటిపండులో ఫైబర్, విటమిన్లు ఏ, బి, సి, డి పుష్కలంగా ఉన్నాయి. ఇవి మలబద్ధకం నుంచి మనల్ని రక్షిస్తాయి. అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రక్తపోటుకు చాలా మంచిది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
Also Read : చర్మం పగులుతుందా!
అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వాత దోషం పెరగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. ఫాస్ట్‌ఫుడ్, కాఫీ, టీ ఎక్కువగా తీసుకున్నా మలబద్ధకం వస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా మలబద్ధకం సమస్య ఉంటుంది. మలబద్దకాన్ని నివారించడంలో అరటిపండు చక్కగా పనిచేస్తుంది. అరటిపండును తేనెతో కలిపి తినడం వల్ల మలబద్ధకం నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా విరోచనాలు అయినప్పుడు ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. మూత్రవిసర్జనలో మంటగా ఉన్నప్పుడు, లేదా నొప్పిగా ఉంటే అరటిపండు దీనికి చక్కటి ఉపశమనంగా వైద్యులు చెబుతున్నారు. అరటి కాండం లేదా రసం ఈ చికాకు నియంత్రించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: ఈ పండు చాలు జిమ్ అక్కర్లేదు.. సులభంగా బరువు తగ్గొచ్చు
శరీరంలో నుంచి విషాన్ని కూడా తొలగిస్తాయి. సరైన నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి లాంటిది జ్ఞాపకశక్తి తగ్గడానికి ప్రధాన కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో అరటిపండ్లు రోజు తినడం వల్ల నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్యలు, ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రోజుకు ఒకటి నుంచి రెండు అరటి పండ్లు తినాలని వైద్యులు కూడా చెబుతున్నారు. చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో అరటి పండ్లను తింటుంటారు. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అందుకే అరటిపండును ఖాళీ కడుపుతో తినకూడదు అరటిపండు జీర్ణం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎసిడిటీ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, దగ్గు, ఆస్తమా ఉంటే రాత్రిపూట అరటిపండ్లు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది కఫాన్ని పెంచుతుంది. ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో అరటిపండు తినడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు.
Also Read : వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే