Pacha Bottu Song Promo
ఇప్పుడు యూట్యూబ్ లో అంతా ఫోక్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. సినిమా పాటలను మించి యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబడుతున్నాయి. ఓ చిన్న రాములమ్మ నుంచి మొదలుకొని రాను బొంబైకి రానూ, సిలుకు సునీత, దారిపొంటోత్తుండు.. దవ్వదవ్వొస్తుండు ఇలా ఫోక్ లిరిక్స్ తో వచ్చిన చాలా పాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఒకప్పుడు జానపద పాటలు అంటే పల్లెల్లో మాత్రమే వినిపించేవి! కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త తరం సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ పాటలకు ఆధునిక బీట్స్, సంగీతం జోడించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈ మార్పుతో యువతకు కూడా ఫోక్ సాంగ్స్ బాగా చేరువయాయ్యి. ఇప్పుడు ఎక్కడ డీజే పెట్టిన ఈ పాటలు పెట్టుకునే డాన్సులు వేస్తున్నారు యూత్.
మరో కొత్త సాంగ్..
మంగ్లీ, మౌనిక యాదవ్, రాము రాథోడ్, సాయి చంద్, మధుప్రియ ఈ పాటలకు మరింత క్రేజ్ తీసుకొచ్చారు. వీరి పాటలు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. ఇటీవలే రాము రాథోడ్ పాడిన 'రాను బొంబైకి రాను' ఆల్బమ్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఏకంగా 453 మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపింది. ఈ పాట కోసం 5 లక్షల పెట్టుబడి పెట్టగా.. 20 లక్షలు రాబట్టినట్లు రాము రాథోడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
'బొంబైకి రాను' పాట తర్వాత ఇప్పుడు మరో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామురాథోడ్. తాజాగా తన కొత్త ఆల్బమ్ 'పచ్ఛా బొట్టు బావయో' పాట ప్రోమోను విడుదల చేశాడు. ఇందులో కూడా లిఖిత, రాము జంటగా స్టెప్పులేశారు. జానపద లిరిక్స్, మాస్ బీట్స్ తో ఎనర్జిటిక్ గా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాటలో డాన్సర్స్ ధరించిన కాస్ట్యూమ్స్ కూడా పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేస్తున్నాయి.
Also Read: Mrunal Thakur: సినిమా రివ్యూల పై నిప్పులు చెరిగిన మృణాల్ ఠాకూర్! ఫ్యాన్ తో చిట్ చాట్ వైరల్