ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పైనాపిల్ ఒకటి. తీపిగా, పులుపుగా ఉండే పైనాపిల్‌ను డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు చర్మాన్ని రక్షిస్తుంది. ఇది ఎక్కువగా వేసవిలో లభిస్తుంది. దీనిని తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పైనాపిల్‌లో విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
మలబద్దకం నుంచి విముక్తి
ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇందులో ఎక్కువగా బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. అలాగే రోజూ పైనాపిల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలని అనుకున్నవారికి ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు గుండె సమస్యలను తగ్గిస్తుంది. అయితే డయాబెటిక్, గర్భిణులు పైనాపిల్ తీసుకోకూడదు.
Also Read : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం!