ఈ 5 తప్పులు పిల్లల్లో మీపై నమ్మకాన్ని పోగొడతాయి?

తల్లిదండ్రులు తెలిసి తెలియక చేసే తప్పులు తమపై పిల్లలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. పిల్లల భావాలను గౌరవించకపోవడం, వారిని పదే పదే తిట్టడం, ఇతరులతో పోల్చడం వంటివి చేయకూడదు. ఇవి పిల్లలకు మీపై ఉన్న నమ్మకాన్ని, బంధాన్ని క్రమంగా దూరం చేస్తాయి. 

New Update
parenting tips for kids

parenting tips for kids

Parenting Tips: పిల్లలు తల్లిదండ్రులను విశ్వసించినప్పుడే.. వారు తమ భావాలను బహిరంగంగా పంచుకుంటారు. ఆలాగే సరైన దిశలో పయనిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో పిల్లల విషయంలో  తల్లిదండ్రులు తెలిసి తెలియక చేసే తప్పులు తమపై పిల్లలు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఇది పిల్లలు- పేరెంట్స్ మధ్య బంధాన్ని బలహీనపరుస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేయకూడని 5 తప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి. 

 

తేలికగా తీసుకోవడం

కొన్ని సందర్భాల్లో పిల్లలు పేరెంట్స్ తో ఏదైనా పంచుకున్నప్పుడు.. వాటిని లైట్ తీసుకుంటుంటారు. దీనివల్ల పిల్లలు హార్ట్ అవుతారు. క్రమంగా వారి ఆలోచనలను పంచుకోవడం ఆపేస్తారు. తల్లిదండ్రులు పదే పదే ఇలా చేయడం ద్వారా పిల్లవాడు తమ భావాలకు ఎటువంటి ప్రాముఖ్యత లేదని భావిస్తాడు. ఇది పిల్లలు- తల్లిదండ్రుల మధ్య దూరాన్ని పెంచుతుంది. 

పదే పదే తిట్టడం

పిల్లలను పదే పదే తిట్టడం విమర్శించడం వారిలో అభద్రతా భావాన్ని కలిగిస్తుంది.  ఎల్లప్పుడూ ప్రతికూల విషయాలను వినడం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. తల్లిదండ్రుల నుంచి మానసికంగా దూరం కావడం ప్రారంభిస్తారు.  

ప్రామిస్ నిలబెట్టుకోకపోవటం 

నేటి బిజీ లైఫ్ లో చాలా మంది పేరెంట్స్ పిల్లలకు చేసే ప్రామిస్ లను మర్చిపోతూ ఉంటారు. ఇది మీకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ వారి మనసును చాలా బాధిస్తుంది. ఏదైనా ప్రామిస్ చేసి నెరవేర్చకపోతే భవిష్యత్తులో పిల్లవాడు మిమల్ని నమ్మడానికి వెనకాడతాడు. 

ఆలోచనలను గౌరవించడం 

పిల్లల భావాలను, ఆలోచనలను  గౌరవించాలి. వారు తమ ఆలోచనలను మీతో పంచుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు- తల్లిదండ్రులకు మంచి బాండింగ్ ఉంటుంది. 

ఇతరులతో పోల్చడం  

ప్రతి పిల్లవాడు తనదైన లక్షణాలను, టాలెంట్ ని కలిగి ఉంటాడు.  కానీ పేరెంట్స్ అవి గుర్తించడం మానేసి.. తమ పిల్లలను ఇతరులతో పోలుస్తారు. ఇది పిల్లల్లో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడమే కాకుండా.. వారి ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు