పారాసెటమాల్ ఎక్కువగా వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త

పారాసెటమాల్ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కడుపు సంబంధిత సమస్యలు, అలెర్జీ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

New Update
Expired Tablets

Tablets

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక సీజన్‌లో జ్వరం వస్తుంది. బాడీ కాస్త వేడి అయితే చాలు.. వెంటనే పారాసెటమాల్ టాబ్లెట్లు వేసేస్తారు. కనీసం డాక్టర్ పర్మిషన్ లేకుండా టాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు పారాసెటామాల్ టాబ్లెట్‌ను వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు అసలు వీటిని ఇవ్వకూడదు. వీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలు, కాలేయం దెబ్బ తింటుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!

పారాసెటమాల్ ఎక్కువగా తీసుకుంటే..

పారాసెటమాల్ ఎక్కువగా వేసుకుంటే గుండె వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని కాస్త లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా వీటిని తీసుకుంటే శరీరంలోని అన్ని భాగాలు కూడా పూర్తిగా దెబ్బ తింటాయని అంటున్నారు. ముఖ్యంగా కిడ్నీలు తొందరగా దెబ్బ తింటాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు అలెర్జీ, కడుపు సంబంధిత సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇది కూడా చూడండి:  Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే

పారాసెటమాల్‌లోని రసాయనాలు కడుపు పొరను పూర్తిగా దెబ్బతీస్తుంది. అలాగే జీర్ణ సమస్యలను కూడా పెంచుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి పారాసెటమాల్‌ను ఎక్కువగా తీసుకోవద్దు. వీటిని తీసుకోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు