/rtv/media/media_files/2025/08/30/new-gold-in-pink-paper-2025-08-30-13-23-39.jpg)
New gold in pink paper
పండుగలు, పెళ్లిళ్లలకు కొత్త బంగారాన్ని కొందరు కొంటుంటారు. బంగారం చిన్న లేదా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా కూడా తప్పకుండా గులాబీ రంగు కాగితంలో పెట్టి ఇస్తారు. అయితే ఈ గులాబీ రంగు కాగితంలో పెట్టి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? సంప్రదాయమా లేకపోతే బిజినెస్ ట్రిక్ హా అనే విషయం మీకు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయాల్సిందే.
ఇది కూడా చూడండి: Fake honey: నకిలీ తేనెతో మీ కిడ్నీలు ఫసక్.. ఇలా పసిగట్టండి!
హిందూ సంప్రదాయంలో గులాబీ రంగును సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన రంగుగా భావిస్తారు. బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకే పవిత్రమైన బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రీతికరమైన గులాబీ రంగు కాగితంలో పెడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని, అదృష్టం వస్తుందని కొందరు నమ్ముతారు. అలాగే గులాబీ రంగు శుభానికి, ఆనందానికి, ప్రేమకు ప్రతీక. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో కొత్త బంగారం కొనుగోలు చేస్తారు. ఈ శుభ సందర్భాన్ని సూచించడానికి బంగారాన్ని గులాబీ రంగు కాగితంలో పెట్టి ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది.
ప్రతికూల శక్తులు దూరం..
జ్యోతిష్యం ప్రకారం గులాబీ రంగు సానుకూల శక్తిని ఆకర్షించి, ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అయితే బంగారం చాలా విలువైనది. దీన్ని దుష్ట శక్తుల నుంచి రక్షించడం కోసం గులాబీ రంగు కాగితాన్ని ఉపయోగిస్తారు. అయితే బంగారాన్ని గులాబీ రంగు కాగితంలో పెట్టడానికి ఇంకో కారణం ఉంది. సాధారణంగా బంగారు ఆభరణాలు పసుపు రంగులో ఉంటాయి. గులాబీ రంగుపై పసుపు రంగు చాలా ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తుంది. ఇది బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా చూపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే గులాబీ రంగు కాగితంలో బంగారం పెడతారని మరికొందరు భావిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Lunar Eclipse: వారం రోజుల్లో చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి యమ డేంజర్.. జాగ్రత్తగా ఉన్నా తప్పని సమస్యలు!
ఈ కాగితంలో బంగారం అందంగా కనిపిస్తే కొనుగోలుదారులు కూడా కొనడానికి ఇష్టపడతారట. అలాగే బంగారం చాలా మృదువుగా ఉంటుంది. బాగా విలువైనది కావడంతో గులాబీ రంగు కాగితంలో చుట్టడం వల్ల అది గీతలు పడకుండా ఉంటాయి. ఈ గులాబీ రంగు కాగితం రక్షణ కవచంలా పనిచేస్తుందని ఉపయోగిస్తారని కూడా మరికొందరు అంటున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.