Mouthwash: మౌత్ వాష్ వాడుతున్నారా..ఈ క్యాన్సర్ తప్పదు

ప్రతిరోజూ మౌత్‌ వాష్‌ను వాడటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. మౌత్‌వాష్‌లో ఉండే ఆల్కహాల్ నోటిని పొడిగా, శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఇందులో వాడే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Mouthwash

Mouthwash

Mouthwash: మౌత్ వాష్ గురించి అందరికీ తెలుసు. చాలా మంది దీన్ని రోజూ వాడుతుండగా, మరికొందరు అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. మౌత్ వాష్ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది దంతాలకు మంచిదని మనకు తెలిసినప్పటికీ ప్రతిరోజూ మౌత్‌ వాష్‌ను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మౌత్ వాష్ వాడకాన్ని పరిమితం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. ఇది మీ నోటిని పొడిగా చేస్తుంది. అంతేకాకుండా రోజువారీ ఉపయోగం శరీరంలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మౌత్ వాష్ వాడకం మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది. 

క్యాన్సర్ వచ్చే ప్రమాదం:

రోజుకు రెండుసార్లు మౌత్‌ వాష్‌ని ఉపయోగించేవారిలో పదోవంతు మందిలో ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. మౌత్ వాష్‌లను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం. చాలా దుష్ప్రభావాలకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మౌత్‌ వాష్‌ను రోజూ వాడేవారికి లేదా అతిగా వాడేవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో వాడే పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత తక్కువగా వాడాలని సలహా ఇస్తున్నారు. నేడు మార్కెట్‌లో అనేక రకాల రుచులు, సువాసనలతో మౌత్‌ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?

నోటి దుర్వాసనను తొలగించడానికి, ఆహ్లాదకరమైన సువాసనను అందించడానికి వీటిని సాధారణంగా ఉపయోగిస్తారు. కొన్నింటిని నేరుగా వినియోగిస్తే మరి కొన్నింటిని నీటిలో కలుపుతారు. ఎంత మొత్తం తీసుకోవాలో కూడా కంపెనీలే నిర్ణయిస్తాయి. సాధారణంగా 15-20 ml మౌత్ వాష్ వాడాలి. మౌత్‌ వాష్‌ను మీ నోటిలో ముప్పై సెకన్ల పాటు ఉంచాలి. ముందుగా, దంత కీళ్లలో ఇరుక్కున్న ఆహారపు చిన్న రేణువులను తొలగించడానికి డెంటల్ ఫ్లాస్‌ని ఉపయోగించాలి. శుభ్రమైన నీటితో నోటిని పుక్కిలించాలి. మరీ ముఖ్యంగా, బ్రషింగ్‌కు ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగించకూడదు, నోటి పరిశుభ్రత కోసం బ్రషింగ్ తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు స్ట్రోక్ ప్రమాదం ఉందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు