ఈ సూపర్ ఫుడ్ తింటే.. వింటర్ సీజన్ సమస్యలన్నీ దూరం శీతాకాలంలో పుట్టగొడుగులను తినడం వల్ల వింటర్ సీజన్ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 03 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగులు విరివిగానే లభిస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే వీటిని చలికాలంలో తింటే సమస్యలన్నింటి నుంచి విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎలాంటి వ్యాధులు దరిచేరనివ్వకుండా పుట్టగొడుగులు బాగా సాయపడతాయి. వీలైతే రోజూ తినడం అలవాటు చేసుకోండి. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం! ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు.. ఇందులో తక్కువ కేలరీలు, కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇవి గుండె జబ్బుల రాకుండా ఉంచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడి, కీళ్ల నొప్పులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? కొందరు బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారు వీటిని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి ఆకలిని అదుపులో పెడతాయి. దీంతో మీరు తక్కువగా తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. కొందరు జీర్ణ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి పుట్టగొడుగులు బాగా ఉపయోగపడుతాయి. వీటిని తినడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉండి జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! #mushroom మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి