/rtv/media/media_files/2025/01/16/men-and-womenn.jpeg)
ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీలు 5% ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా జపాన్ దేశంలోని గణాంకాలను పరిశీలించగా.. పురుషుల సంఖ్య కంటే 100 ఏళ్లు పైబడిన మహిళల సంఖ్య 90 శాతం ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..
/rtv/media/media_files/2025/01/16/men-oldd.jpeg)
మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి అనేక అంశాలు కారణాలుగా ఉన్నాయి. పురుషుల సెక్స్ హార్మోన్లతో పోలిస్తే.. స్త్రీల సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజెన్ ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/01/16/men-with-womenn.jpeg)
ఈస్ట్రోజెన్ హార్మోన్ శరీర కణాలపై ఒత్తిడి తెచ్చే హానికరమైన రసాయనాలను నాశనం చేసే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
/rtv/media/media_files/2025/01/16/men-womenn.jpeg)
అలాగే స్త్రీలు, పురుషుల మధ్య జీన్స్ ( జన్యువుల) వ్యత్యాసం కూడా మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి ఒక కారణం. స్త్రీలకు రెండు X క్రోమోజోమ్‌లు ఉంటే, పురుషులకు ఒక X , ఒక Y క్రోమోజోమ్‌లు ఉంటాయి.
/rtv/media/media_files/2025/01/16/men-life-expectancy-lesss.jpeg)
ఈ క్రోమోజోమ్‌లలోని వ్యత్యాసం కూడా మహిళలు ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడుతుంది. ఎందుకంటే.. X క్రోమోజోమ్‌లో రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే జన్యు విభాగాలు ఉంటాయి.
/rtv/media/media_files/2025/01/16/men-and-womenn.jpeg)
కొన్ని దేశాల్లో ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు కూడా పురుషులు తక్కువ కాలం జీవించడానికి కారణమవుతాయి. ఇలాంటి అలవాట్లు మహిళల్లో తక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ అంశాలపై మరింత పరిశోధన జరపాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/01/16/men-olderr.jpeg)
ఎక్కువ కాలం జీవించడానికి ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు క్రమశిక్షణ కూడా తప్పనిసరి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, ఏరోబిక్ చేయాలి. వారానికి కనీసం రెండు రోజులు ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ మంచిది. అంటే రాత్రి భోజనం, అల్పాహారం మధ్య 16 గంటల విరామం తీసుకోవాలి.
/rtv/media/media_files/2025/01/16/menn.jpeg)
తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్థాలు, అధిక ప్రోటీన్ ఆహారంలో చేర్చుకోండి. అయితే, మీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసేముందు ఖచ్చితంగా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.
/rtv/media/media_files/2025/01/16/men-vs-womenn.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.