White Pepper: తెల్ల మిరియాలతో కంటి ఆరోగ్యం.. ఎలా తీసుకోవాలంటే

తెల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమని చెబుతున్నారు నిపుణులు. ఇవి కంటి చూపు, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడంలో కూడా తోడ్పడతాయి.

New Update
White Pepper: తెల్ల మిరియాలు ఎప్పుడైనా తిన్నారా?..ఎన్నో లాభాలు

White Pepper

Health: తెల్ల మిరియాలు ఒక ఔషధం లాంటివి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. నిజానికి, తెల్ల మిరియాలను నల్ల మిరియాల నుంచి తయారు చేస్తారు.   కానీ దాని రుచి నల్ల మిరియాల వలె కారంగా ఉండదు. తెల్ల మిరియాలు బరువు తగ్గడానికి, పంటి నొప్పిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. తెల్ల మిరియాల ప్రయోజనాల గురించి ఇక్కడ  తెలుసుకుందాం..

 బరువు తగ్గడానికి 

తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ శరీర కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే పెరుగు సలాడ్ పై తెల్ల మిరియాలు చల్లి తినండి.

కంటి చూపు

తెల్ల మిరియాలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. రెండు నుంచి  మూడు తెల్ల మిరియాలను చూర్ణం చేసి పాలలో కలిపి  తాగడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది.

Also Read: Rishab Shetty:ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

దగ్గు నుంచి ఉపశమనం 

 కఫం, శ్లేష్మం, దగ్గు ఉంటే తెల్ల మిరియాలు తినండి. తెల్ల మీరియల్లోని  ఘాటు కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఛాతిలో ఉబ్బరం నుంచి   నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల మిరియాలను పచ్చి తేనెతో కలిపి తినడం వల్ల జలుబు, దగ్గు నుంచి రిలీఫ్   లభిస్తుంది.

ఊపిరితిత్తులు ఆరోగ్యం

ఊపిరితిత్తుల చుట్టూ నీరు ఉండడం వల్ల  శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో, తెల్ల మిరియాలు తినడం వల్ల అదనపు ద్రవం బయటకు పోతుంది. తద్వారా  ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

కడుపులో గ్యాస్ 

గ్యాస్ తో బాధపడేవారు తెల్ల మిరియాలు తింటే ప్రయోజనాకరంగా ఉంటుంది.  ఇవి  కడుపులో హైడ్రోక్లోరిక్ స్రావాన్ని పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా, వేగంగా  జరుగుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ఐదు ఆహారాలతో కాలేయం సేఫ్‌.. ఆరోగ్యంగా ఉండాలంటే..!!

Advertisment
తాజా కథనాలు