మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. డైలీ డైట్ లో వీటిని తీసుకోవడం ద్వారా మెదడు, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
కూరగాయలు
బచ్చలి కూర, బ్రోకలీ, బీట్ రూట్, ఉల్లిపాయలు, టమోటో, వంటి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అందుకే డైలీ డైట్ లో వీటిని చేర్చడం ఆరోగ్యానికి మంచిది.
నట్స్
రోజూ ఉదయాన్నే చియా సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, సన్ ఫ్లవర్ సీడ్స్, వాల్ నట్స్, బాదంపప్పులు వంటి గింజలను తీసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
ప్రోటీన్
సాల్మన్ ఫిష్, గుడ్లు, పెరుగు, చికెన్ వంటి ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మూడ్ స్టెబిలైజర్లుగా పనిచేస్తాయి. ఆహారంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలను పరిష్కారమవుతాయి.
ఫ్రూట్స్
సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలి. యాపిల్. దానిమ్మ, ఆరెంట్ వంటి తక్కువ చక్కర పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. వీటిలోని విటమిన్ సి చర్మాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
దానిమ్మ
అలాగే దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు.